మెగా కాంపౌండ్ నుండి అప్లోడ్ అయిన మెగాబ్రదర్ తనయుడు వరుణ్‌తేజ్ వరుసగా ఫిదా, తొలిప్రేమ చిత్రాలతో వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. పిబ్రవరి 10 శనివారం విడుదలైన ఈ చిత్రం తొలిరోజు 9కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. కెరీర్లో భారీ హిట్ అందుకున్న వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో అభినందనలు వెలువెత్తుతున్నాయి. ప్రస్తుత హీరోలు పాటిస్తున్న మూస ధోరణికి దూరంగా.. కథల ఎంపికలో వైవిధ్యం ప్రదర్శిస్తోన్న వరుణ్ తన సీక్రెట్స్ కొన్ని మీడియాతో పంచుకున్నారు.
వరుణ్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు తాను ఎవరినీ ప్రేమించడం లేదని.. ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నానని, ఎవరితో డేటింగ్ చేయడం లేదని చెప్పుకొచ్చాడు. ఒకవేళ అమ్మాయి దొరికితే తప్పకుండా చెబుతున్నానని చెప్పిన మెగా ప్రిన్స్.. ఘాజీ దర్శకుడు సంకల్ప్ రెడ్డితో తదుపరి చిత్రం చేయబోతున్నట్లు తెలిపాడు. ఇంట్లో నాన్న నన్ను ఎదవ అని పిలుస్తారని.. అమ్మ వరుణ్ బాబు అని పిలుస్తుందని తనకున్న ముద్దు పేర్లను బయటపెట్టాడు. మీ వయసెంత అని ప్రశ్నించగా.. నేను 1990లో పుట్టానండి. నాకిప్పుడు 28 ఏళ్లు. దాచుకోవడానికి ఏం లేదిక్కడ అంటూ బదులిచ్చాడు. ప్రభాస్ తనకు మంచి మిత్రుడని, డార్లింగ్ కంటే ఒక అంగుళం పొడవు ఉంటానేమో అని చెప్పుకొచ్చాడు.