ఓ అందమైన అమ్మాయి తన ఓరచూపులతోనే ప్రియుణ్ని చూస్తూ.. కన్నుకొడుతున్న సన్నివేశం సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ప్రేమికుల రోజు వచ్చేస్తున్న నేపథ్యంలో.. ఆ దృశ్యం విపరీతంగా వైరల్ అవుతోంది. మలయాళంలో తెరకెక్కుతున్న ఒరు అదర్ లవ్ అనే చిత్రంలో ఒక కథానాయిక నటిస్తున్న ప్రియ ప్రకాశ్ వారియర్ ఆ చిత్రంలో.. హైస్కూల్ విద్యార్థినిగా నటిస్తోంది.
అయితే ఆదివారం విడుదల చేసిన చిన్న క్లిప్‌లో ప్రియా ఎక్స్‌ప్రెషన్స్‌కి యువత ఫిదా అయిపోతున్నారు.దీంతో ఒక్కసారిగా ఆమె పేరు మార్మోగిపోతోంది. ఎంతగానంటే.. చివరికి రూపాయి నోట్ల మీదా ఆమె పేరే కనిపిస్తోంది. రూపాయి నోట్ల మీద రాతలు రాస్తే అవి చెల్లవంటూ ఆర్బీఐ ఆదేశాలు ఇచ్చింది. అవి చెల్లవని తెలిసినప్పటికీ..
జనాలు ఆమె నామస్మరణ చేస్తున్నారు. చలమాణిలో ఉన్న అన్ని డినామినేషన్ నోట్ల పైనా ప్రియా ప్రకాష్ పేరును రాశారు. ఆ ఫొటోలను ఇప్పుడు
సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరీ తమ అభిమానాన్ని షేర్ చేసుకుంటున్నారు. ఎంత కష్టమొచ్చినా ఆ నోట్లను తాము వాడబోమని, వాటిని ఫ్రేమ్ కట్టిస్తామని అంటున్నారు.