తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు రాష్ట్ర భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పై ప్రసంసల వర్షం కురిపించారు.తుమ్మల మంచి డైనమిక్ మంత్రి అని కొనియాడారు.వివరాల్లోకి వెళ్తే..నిన్న ( ఆదివారం ) మంత్రి హరీష్ రావు ఖమ్మం జిల్లాలో పర్యటించారు.పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో రూ.23కోట్లతో నిర్మించిన లకారం ట్యాంక్‌బండ్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు.
see also :నెటిజన్లు ఆశ్చర్యపోయే ట్వీట్ చేసిన కేటీఆర్..!
ఈ సందర్భంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ..కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రుల మార్పిడి తప్ప అభివృద్ధి జరగలేదన్నారు.గోదావరి పక్కనే ఉన్నా ఖమ్మం జిల్లా కరువుతో అలమటిస్తోందని, దీనికి కారణం కాంగ్రెస్ కాదా అని నిలదీశారు. సీతారామ ప్రాజెక్టు పనులు రెండేళ్లలో పూర్తి చేసి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు . ఖమ్మం జిల్లాలో జరిగిన అభివృద్ధిని చూస్తే తనకు ఆశ్చర్యం కలుగుతుందని..ఇందుకు మంత్రి తుమ్మల పట్టుదలే కారణమని అన్నారు.
see also : గవర్నర్ నరసింహన్ దంపతులను కలసిన ఆమ్రపాలి..!
జాతీయ పార్టీలతో అభివృద్ధి జరగదని, వారి పాలనలో కుర్చీల కొట్లాటలు తప్ప ప్రగతి ఉండదని పేర్కొన్నారు. తెలంగాణలో వంద సీట్లు వస్తాయని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారని.. అది పగటి కలేనని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్ హయాంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళుతోందని, అందుకు ఖమ్మం జిల్లానే నిదర్శనమని తెలిపారు.