పౌరసేవల్లో సాంకేతికతకు పెద్దపీట వేసి వినూత్న విధానాలతో ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వానికి మరో గుర్తింపు దక్కింది. తెలంగాణ మీసేవకు కేంద్రప్రభుత్వ ఈ గవర్నెన్స్ అవార్డు లభించింది. ఈ మేరకు కేంద్ర ప్రభు త్వం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషికి, మీసేవ కమిషనర్ జీటీ వెంకటేశ్వరరావుకు సమాచారం అందించింది. 26-27 తేదీల్లో హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో జరుగనున్న 21వ నేషనల్ కాన్ఫరెన్స్‌లో కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రదానం చేయనున్నది. మీ సేవ 2.0కు సిల్వర్ అవార్డు క్యాటగిరీ-3 కింద ఇన్నోవేషన్స్ ఇన్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఆఫ్ గవర్న్‌మెంట్ డిపార్ట్‌మెంట్స్ ఆదర్ దేన్ పీఎస్‌యూ అనే విభాగంలో అవార్డు దక్కింది.
