Home / MOVIES / దుమ్మురేపుతున్న ప్రియా.. గురించి సంచ‌ల‌న నిజాలు..!

దుమ్మురేపుతున్న ప్రియా.. గురించి సంచ‌ల‌న నిజాలు..!

సోషల్ మీడియా లో ఎవరు ఎప్పుడు ఎలా వైరల్ అవుతారో ఎవరూ ఊహించలేరు. అదృష్టం కలిసొస్తే ఒకే ఒక్క రోజులో దేశం అంతా పాపులారిటీ వచ్చేస్తుంది. దురదృష్టం ఎదురుతంతే అదే సోషల్ మీడియా ఓవర్ నైట్‌లో తలెత్తుకోకుండా కూడా చేస్తుంది. కాసేపు ఆ నెగిటివిటీని పక్కన పెడితే.. ఒక కేరళ కుట్టి దేశం మొత్తాన్ని ఇప్పుడు తనవైపు తిప్పుకుంది.ఇక కేవలం 26 సెకన్ల వీడియో తో యావత్ దేశాన్ని మెస్మరైజ్ చేసింది. తన వెరైటీ ఐ బ్లింక్‌తో నెటిజన్ల గుండెలపై మత్తుమందు చల్లింది. ఒకే రోజులో కోట్ల మంది మనసులు కొల్లగొట్టి లక్షల మంది ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్న అమ్మాయి పేరు ప్రియా వారియ‌ర్… ఇంతకీ అసలు ఆమె ఎవరు.. అలా ఎలా పాపులర్ అయింది.. ఆ అమ్మాయి జీవిత విశేషాలకు సంబంధించిన సీక్రెట్స్ ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రియా ప్రకాష్ వారియర్ ప్రెండ్స్‌ ఆమెని రియా అని కూడా పిలుస్తారు. కేరళ లోని త్రిసూర్ ప్రాంతంలో జన్మించిన ఆమె ప్రస్తుతం మలయాళం లో తన మొదటి సినిమాలో నటిస్తోంది.ఒమర్ లులు దర్శకత్వంలో వస్తున్న ఓరు ఆధార్ లవ్ అనే సినిమాతో ఆమె తెరంగేట్రం చేయనుంది. ప్రస్తుతం బీకామ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అయిన ఆ అమ్మాయి సంగీతం, నృత్యంలో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించింది. సంగీతం, నృత్యం, ట్రావెలింగ్ ఆమె ఫేవరెట్ హాబీస్.ఓరు ఆధార్ లవ్ అనే చిత్రంలో ఉన్న ఒక పాట లోని చిన్న సన్నివేశం ఇప్పుడు ఆమెని ఒక నేషనల్ స్టార్ ని చేసేసింది.

చిన్న సినిమా అయినా కూడా ఇప్పుడు ఆ సినిమా ఎప్పుడు వస్తుందా అని కొన్ని కోట్ల మంది ప్రేక్షకులు ఎదురు చూసేలా ఓ చిన్న సన్నివేశం చేసింది. ఆమె ఒకే రోజులో అయిదు లక్షలకు పైగా ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం వాట్సాప్‌, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్య‌మాల్లో ఈ అమ్మాయే సుడిగాలిలా తిరుగుతోంది. ఆ వీడియోలో న‌టించిన అమ్మాయి అందరికీ తెగ న‌చ్చేసింది. ఆ వీడియోలో ఆ అమ్మాయి హావభావాల‌కు, క‌నుసైగ‌లకు చాలామంది ఫిదా అయిపోతున్నారు.కొంత‌మంది ఆ అమ్మాయి ఫోటోనే త‌మ డీపీగా కూడా పెట్టుకుంటున్నారు.

వాలంటైన్స్ డే సంద‌ర్భంగా సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న ఆ వీడియోలో న‌టించిన అమ్మాయి ఎక్స్‌ప్రెషన్స్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. యూట్యూబ్ ట్రెండింగ్‌లో ఈ సాంగ్ టాప్ ప్లేస్‌లో ఉంది. మార్చి మూడో తేదీన ఈ సినిమా విడుద‌ల కాబోతోంది. ఈ వీడియోనే ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా ట్రెండ్ అవుతోంది. అందులో న‌టించిన ప్రియ తొలి సినిమా కూడా విడుద‌ల కాక‌ముందే సోష‌ల్ మీడియా స్టార్ అయిపోయింది. విడుదలైన రెండు రోజుల్లోనే ఈ పాటను కొన్ని మిలియ‌న్ల మందికి పైగా వీక్షించడం విశేషం. వాలెంటెన్స్ డే నేపథ్యంలో.. ఆ
అమ్మాయి కన్నుకొడుతున్న సన్నివేశాన్ని వాడుకొని నెటిజన్లు మాత్రం తెగ కామెంట్లు గుప్పిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat