దేశంలో ఎక్కడలేని విధంగా అత్యుత్తమ విదానాలతో హైదరాబాద్‌లో నగరంలో ఒక రెయిన్ వాటర్ హార్వేస్టింగ్ పార్కును ఏర్పాటు చేస్తామని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి శ్రీకే. తారకరామారావు గారు తెలిపారు. తేది. 12.02.2018, సోమవారం రోజున ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయంలో జలమండలి, జీహెచ్ఎంసీ. టీఎస్ఐఐసీ, హెచ్ఎండీఏ, సీడీఎమ్ఏ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ వాననీటిని ఓడిసి పట్టడంపై ఈ పార్కు ద్వారా ఇంకుడుగుంతల విధానాలపై ప్రజలకు అవగాహాన కల్సిస్తామని తెలిపారు. ఆ పార్కులో అన్ని అవసరాల కోసం ఎటువంటి నల్లా కనెక్షన్ తీసుకోకుండా వాననీటినే వినియోగిస్తారని వివరించారు. ఈ పార్కును ఆదర్శంగా తీసుకుని హైదరాబాద్ మహానగరంలో అలాంటి పార్కును ఏర్పాటు చేయాలని జలమండలి అధికారులకు సూచించారు. నగరంలో అనువైన చోట ప్రజలు, విద్యార్థులు దాని నుంచి ప్రేరణ పొందేలా ఈ పార్కు రూపుదిద్దుకుంటుందని తెలిపారు.
లాతూర్ ఎదురైన నీటి కష్టాలు అనుభవ దృష్ట్యా అలాంటి పరిస్థితులు హైదరాబాద్‌లో రాకుండా ఉండేందుకు జలం-జీవం లో భాగంగా ఇంకుడుగుంతల నిర్మాణంకు పూనుకున్నామని తెలిపారు. లాతూర్‌లో ప్రత్యేక రైళ్ల ద్వారా మంచినీటిని తీసుకువచ్చి సరఫరా చేసినట్లు గుర్తుచేశారు. మన రాష్ట్ర రాజధానిలో అలాంటి కష్టాలు రాకుండా చైతన్యం కావాలని సూచించారు. నగరంలో కరువు పరిస్థితులు వచ్చిన నీటి కష్టాలు రాకుండా ఉండేందుకే జల-జీవం కార్యక్రమం చేపట్టినట్లు రాష్ట్ర మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ. కే. తారక రామారావు తెలిపారు.నగరంలో భూగర్భ జలాలు, తాగునీటికి ఇబ్బందులు కలగకుండా చూడడమే సీఎం కేసీఆర్ గారి లక్ష్యమన్నారు. అందుకే మంచినీటిని కృష్ణా, గోదావరి నదుల నుంచి నగర దాహార్తి తీసుకుంటున్నాము. కానీ భూగర్భజలాన్ని పెంచాలంటే మాత్రం నగర ప్రజలు ఇంకుడుగుంతల నిర్మాణం చేపట్టాలని తెలిపారు. ఇందుకోసం ప్రజల్లో అవగాహాన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకుల ప్రాంగణాల్లో ఇంకుడుగుంతల నిర్మాణం తప్పనిసరి చేయాలని సంబంధిత అధికారులను సూచించారు. అందుకోసం ప్రతి బ్యాంకుకు ఆదేశాలు జారీ చేయాలని వివరించారు. వీటితో ప్రతి ప్రభుత్వ రంగ సంస్థ , కార్యాలయం, విద్యాసంస్థలో ఇంకుడుగుంతల నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఇంకుడు గుంతల నిర్మాణ ప్రక్రియ నిరంతరం కొనసాగాలని తెలిపారు.టీసాట్, నిపుణ ఛానళ్ల ద్వారా ఇంకుడుగుంతల నిర్మాణంపై అవగాహాన కార్యక్రమాలు ప్రసారం చేయాలని సూచించారు. వీటితో పాటు పిల్లలను చైతన్యపరిచే విధంగా అవగాహాన కార్యక్రమాలు చేపట్టాలని వివరించారు. ఇంకుడుగుంతలు నిర్మించడంతో పాటు వాటి నిర్వహణ చేపట్టడం అత్యంత ఆవశ్యకత విషయమన్నారు. జలం-జీవం కార్యక్రమంలో సెలెబ్రిటీలను భాగస్వామ్యం చేయలని సూచించారు. అలాగే వారితతో పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి సూచించారు.
ఈసందర్బంగా ఎండీ దానకిషోర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన వెయ్యి ఇంకుడుగుంతల్లో అన్ని శాఖల సమన్వయంతో ఇప్పటీకే 821 పూర్తి చేసినట్లు మంత్రికి వివరించారు. అలాగే వాటికి జియోట్యాంగింగ్ చేసినట్లు తెలిపారు. అలాగే ప్రజలను ఇంకుడు గుంతలపై చైతన్యపరిచేందుకు పెద్దఎత్తున అవగాహాన కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఇంకుడు గుంతల నిర్మాణానికి జలమండలి వినియోగదారులకు బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమీషనర్ డా.బి.జనార్ధన్ రెడ్డి, హెచ్ఎండీఏ కమీషనర్ శ్రీ. చిరంజీవులు, మెట్రో ఎండీ శ్రీ. ఎన్వీఎస్ రెడ్డి, మున్సిపల్ పరిపాలన డైరెక్టర్ డా.టి.కె. శ్రీదేవి, జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ. ఎం.సత్యనారాయణ, ఇతర డైరెక్టరు, అధికారులు, జీహెచ్ఎంసీ. టీఎస్ఐఐసీ, హెచ్ఎండీఏ, సీడీఎమ్ఏ అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జలమండలి రూపొందించిన జలం-జీవం కార్యక్రమ పోస్టర్లను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.