Home / ANDHRAPRADESH / తొమ్మిదేళ్ల నాటి హత్యకు ప్రతీకారంగా..ప్యాపిలిలో దారుణ హత్య

తొమ్మిదేళ్ల నాటి హత్యకు ప్రతీకారంగా..ప్యాపిలిలో దారుణ హత్య

కర్నూలు జిల్లా ప్యాపిలిలో రౌడీషీటర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. వెంకటరెడ్డి జాతరకు వెళ్లి వస్తుండగా ప్రత్యర్థులు వేటకొడవళ్లతో నరికి చంపారు. పాతకక్ష్లల నేపథ్యంలో మధు హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ప్యాపిలి కుంటగడ్డ సమీపంలో తొండపాటి నరసింహులు కుటుంబం ఉంటోంది. వీరికి ముగ్గురు కుమారులు కాగా చిన్న కుమారుడు మధు (35) శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. గ్రామంలో జరుగుతున్న తిరునాలకు వెళ్లి ఇంటికి వస్తుండగా సామూహిక మరుగుదొడ్డి సమీపంలో కాపుకాచిన ప్రత్యర్థులు వేటకొడవళ్లతో దాడిచేసి అత్యంత కిరాతకంగా నరికి హత్యచేశారు. కొనఊపిరిలో ఉన్న మధును కుటుంబ సభ్యులు డోన్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మధు, ఇంద్రజ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం కాగా భార్య గతవారం మూడో కాన్పులో ఆడపిల్లకు జన్మనిచ్చింది. శనివారం వారిని డోన్‌లోని ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకువచ్చి గ్రామంలో జరగుతున్న తిరునాలకు వెళ్లి ప్రత్యర్థుల దాడిలో హత్యకు గురికావడం కుటుంబ సభ్యులను తీవ్రంగా కుంగదీసింది. మృతదేహం వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. హత్య ఉదంతం తెలియడంతో మాజీ ఎంపీపీ, తెదేపా మండల కన్వీనర్‌ టి.శ్రీనివాసులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

2009 నవంబరు 29న గ్రామానికి చెందిన లక్ష్మీరంగయ్య హత్యకు గురయ్యారు. నాటుసారా విక్రయిస్తున్న లక్ష్మీరంగయ్య సారాను తన పొలం వద్ద దాచి పెట్టేవాడు. పక్క పొలానికి చెందిన తొండపాటి నరసింహులు, లక్ష్మీరంగయ్య ఈ విషయంలో గొడవపడేవారు. ఈ నేపథ్యంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణలు తలెత్తేవి. దీంతోపాటు పొలం వివాదం ఉండటంతో రెండు కుటుంబాలు ఘర్షణలకు పాల్పడి ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడంతో రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగింది. ఈ నేపథ్యంలో లక్ష్మీరంగయ్య కత్తిపోటుతో హత్యకు గురయ్యారు. అప్పట్లో లక్ష్మీరంగయ్య ఇంట్లో కుమార్తె మరులు పెళ్లి తంతు జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. ఈ హత్యకు సంబంధించి నరసింహులుతో పాటు 16 మందిపై కేసు నమోదైంది. ఈ కేసులో ప్రస్తుతం హత్యకు గురైన మధు అయిదో ముద్దాయి. సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసును గత ఏడాది డిసెంబరులో కొట్టివేశారు. దీన్ని మనసులో పెట్టుకొని ప్రత్యర్థులు తొండపాటి పాండురంగడు మరి కొంతమంది కలిసి మధు కళ్లలో కారం పొడి చల్లి వేట కొడవలితో నరికి చంపినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. రెండు కుటుంబాల్లో జరిగిన హత్యలు శనివారం కావడం కాకతాళీయమే.

11 మందిపై కేసు నమోదు
ఘటన విషయం తెలియగానే డోన్‌ డీఎస్పీ బాబా ఫకృద్దీన్‌ హుటాహుటిన శనివారం రాత్రి ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్య జరిగిన తీరుపై మృతుడి బంధువులను విచారించారు. తొమ్మిదేళ్ల నాటి హత్యకు ప్రతీకారంగానే ఈ హత్య జరిగినట్లు నిర్ధారించుకున్నారు. శనివారం రాత్రి నుంచి రెండు కుటుంబాల వద్ద పోలీస్‌ పికెట్‌ను ఏర్పాటు చేసి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మధు మృతదేహాన్ని ఇంటికి తరలించే సమయంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. బనగానపల్లె, డోన్‌ సీఐలు శ్రీనివాసులు, రాజగోపాల్‌నాయుడు నేతృత్వంలో ఎస్సైలు ఎ.సి.పీరయ్య, తిరుపాలు, రాకేష్‌, గంగాధర్‌, పోలీసు సిబ్బంది పరిస్థితిని అదుపులో ఉంచారు. మృతుడి పెదనాన్న మద్దయ్య ఫిర్యాదు మేరకు తొండపాడు పాండురంగడుతో పాటు తొండపాడు రామాజనేయులు, టి.ఓబులేసు, టి.మధు, కొండా కొండన్న, పూజారి వెంకటేష్‌, పోదొడ్డి శివ, డైలి రామాంజనేయులు, వై.టి.చెరువు నాగేంద్ర, పూజారి శ్రీనివాసలు మొత్తం 11 మందిపై ప్యాపిలి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు డీఎప్పీ తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat