నాయకుడికి.. నట నాయకుడికి తేడా ఇదేనేమో..!! అవును, ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. అయితే, ఓ సారి వెండితెరస్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్దిల వివరాలపై ఓ చూపు చూద్దాం.
see also : ఛీ..హీరో రాజశేఖర్ పరువు తీశాడు..!!
వివరాల్లోకెళ్తే..!!
జనవరి 20, ఈ డేట్ రాజకీయ నాయకులతోపాటు, పవన్ కల్యాణ్ అభిమానులందరికీ గుర్తే ఉంటుంది. ఎందుకంటే జనసేనాని తన రాజకీయ యాత్ర గురించి ప్రకటించిన రోజు ఆ తేదీనే. జనవరి 22వ తేదీ నుంచి తన యాత్ర నిర్విరామంగా కొనసాగుతుందని, తెలంగాణలో తన యాత్ర పూర్తవగానే, ఆ వెంటనే ఆంధ్రలో కొనసాగిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అలా తన రాజకీయ యాత్రను తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం సాక్షిగా ప్రారంభించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
see also : స్టార్ హీరోతో అనసూయ ఎఫైర్..! ఫోటోలతో సహా బయటపెట్టిన ఆరేళ్ల బాలుడు..!!
అంతకు ముందే, వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి 2017 నవంబర్ 6వ తేదీ నుంచి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు నిర్వీరామంగా పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అనుకున్నదే తడవుగా కడప జిల్లాలోని ఇడుఉలపాయ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు తన ప్రజా సంకల్ప యాత్రను ప్రారంభించారు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఇప్పటికే ప్రజా సంకల్ప యాత్ర వెయ్యి కిలోమీటర్లు దాటి రెండువేల కిటోమీటర్ల వైపు దూసుకుపోతోంది.
ఇప్పుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పవన్ కల్యాన్‌ల యాత్రల గురించి బేరీజు వేసిన నెటిజన్లు.. ఇద్దరిపై పలు విధాల కామెంట్లు చేస్తున్నారు. అయితే, వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రజల సమస్వలను స్వయంగా తెలుసుకునేందుకు ప్రారంభించిన ప్రజా సంకల్ప యాత్ర నేడు 84 రోజులు పూర్తి చేసుకుని నేడు 85వ రోజు విజయవంతంగా కొనసాగుతోంది. పాదయాత్ర మధ్యలో తన అరికాళ్లకు గాయాలైనా.. చలి జ్వరం వచ్చినా.. తన శరీరానికి చిన్న చిన్న గాయాలైనా లెక్కచేయని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల సంక్షేమం కోసం తాను చేపట్టి పాదయాత్రను 85 రోజులు చేరుకోవడంపై ప్రజలు హర్షిస్తున్నారు.
see also : పవన్ కల్యాణ్‌కు అంత సీన్ లేదు..! సంచలన వ్యాఖ్యలు చేసిన ముద్రగడ..!!
ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయానికొస్తే కరీంనగర్ జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం నుంచి ప్రారంభించిన తన రాజకీయ యాత్రను నిర్వీరామంగా కొనసాగిస్తానని చెప్పి మరీ మూడు రోజులకే చాపచుట్టేశారు. ఇద్దరి యాత్రలపై ఓ లుక్ వేసిన నెటిజన్లు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నాయకుండంటే వైఎస్ జగన్‌మోహన్ అని, అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేవాడే నాయకుడంటూ జగన్‌ను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.