తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంత్రి హరీష్ రావు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినాన్ని ప్రజలంతా భక్తి శ్రద్ద లతో జరుపుకోవాలని కోరారు.వారు చేసే ఉప వాస దీక్షతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. శివుని అనుగ్రహం తో ప్రభుత్వ పాలన,సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అద్భుతంగా అందుతున్నాయని అన్నారు.
సీఎం కేసీఆర్ పాలన దిగ్విజయంగా కొనసాగాలని భగవంతున్నీ మనసారా వేడుకొంటున్నానని ఆయన చెప్పారు. పరమేశ్వరుని కటాక్షంతో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నట్టు తెలిపారు.
వచ్చే ‘ మహాశివరాత్రి ‘ కల్లా ప్రాజెక్టు పూర్తిఅయ్యి రాష్ట్రమంతా సస్యశ్యామలం కావాలని రైతుల కుటుంబాల్లో వెలుగులు నింపాలని ప్రార్థించారు.ప్రతి ఏటా రైతులు రెండు పంటలు పుష్కలంగా పండించే విధంగా ప్రాజెక్టు ల ద్వారా సాగునీటిని అందిస్తామన్నారు.