తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టం దేశానికే ఆదర్శమని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు . ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధిపై సచివాలయంలో అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తి కావడానికి మరో 50 రోజుల గడువు ఉందన్నారు. 45 నుంచి 50 రోజుల్లో షెడ్యూల్డ్‌కులాల ప్రత్యేక నిధి ఖర్చు చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రణాళిక ప్రకారం నిధులు ఖర్చులు పెడితే సులువుగా లక్ష్యాన్ని చేరుకుంటామని చెప్పారు. నిధులు మురిగిపోకుండా అధికారులు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగానే కేసీఆర్ ఈ చట్టాన్ని తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఎస్సీ విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలు నెలకొల్పాం. మహిళా గురుకుల కళాశాలలు స్థాపించాం. ఎస్సీ గురుకులాలను మరింత పటిష్టం చేస్తున్నాం. గురుకుల పాఠశాలల విద్యార్థులు కష్టపడి చదవి ర్యాంకులు సాధిస్తున్నారని మంత్రి కొనియాడారు.