తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కేటీఆర్ భిన్నమైన వ్యక్తిత్వానికి ఇదో నిదర్శనం. విభిన్నమైన రాజకీయవేత్తగా గుర్తింపు పొందిన కేటీఆర్ యువమంత్రిగా తన శాఖలను అభివృద్ధి పథంలో తీసుకువెళుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఎన్నో ప్రఖ్యాత వేదికల నుంచి ఆహ్వానం వచ్చాయి. తమ కార్యక్రమాల్లో ప్రసంగించాలని కోరాయి. ఇలాంటి జాబితాలో ప్రపంచప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ ఒకటి.
My apologies for not showing up at Harvard India conference. 2nd year in a row now?
May be 3rd is a charm ? https://t.co/1eMbNbBIi2
— KTR (@KTRTRS) February 11, 2018
హార్వర్డ్‌లో జరిగే ఇండియా కాన్ఫరెన్స్ సదస్సుకు హాజరుకావాలని మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. అయితే మంత్రి కేటీఆర్ హాజరుకాలేకపోయారు. అయినప్పటికీ…ఆయన తన స్పందన చాలా హుందాగా ఓ ట్వీట్ ద్వారా తెలియజేశారు. `హార్వర్డ్‌లో కీలక ప్రసంగానికి రాలేకపోతున్నందుకు క్షమాపణలు కోరుతున్నారు. వరుసగా రెండో సారి హాజరుకాలేకపోయాను. వచ్చే ఏడాది తప్పకుండా వస్తాను` అంటూ ట్వీట్ చేశారు.
కాగా, మంత్రి కేటీఆర్ ట్వీట్‌కు అమెరికాకు చెందిన పలువురు నెటిజన్లు స్పందించారు. చాలా హుందాగా మీ స్పందన తెలియజేశారంటూ వాళ్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా, కీలక సమావేశాలు ఉన్న కారణంగా మంత్రి కేటీఆర్ ఈ సమావేశానికి వెళ్లలేదని సమాచారం.