తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అనూహ్యమైన ట్వీట్ చేశారు. తన ట్వీట్‌తో పలువురిని ఆయన ఆశ్చర్యంలో పడేశారు. మంత్రిగా ఆయన తన కార్యకలాపాలతో ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడూ సినిమాలకు సంబంధించి తన అభిప్రాయాలను కూడా పంచుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి ట్వీట్లపై మరో రకంగా స్పందించిన వారికి సరైన స్పందన ఇచ్చారు.
To those people who seem to have a problem with me watching a movie or changing my DP!!!
Get a life guys; while I may be in public life, I am also entitled to my likes & dislikes. If you don’t like it, feel free to unfollow me ?
— KTR (@KTRTRS) February 11, 2018
శనివారం రాత్రి ఆయన తొలిప్రేమ సినిమా చూశానని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇది కొందరు నెటిజన్లకు నచ్చలేదు. ఆ తరువాత కేటీఆర్ ట్విట్టర్‌లో తన ప్రొఫైల్ ఫొటోను మార్చుకున్నారు. కొందరు నెటిజన్లు దీన్ని కూడా తప్పుబడుతున్నారు. అయితే దీనిపై మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. ‘నేను సినిమాలు చూస్తున్నానని, ప్రొఫైల్ పిక్చర్‌లు మారుస్తున్నానని ఎవరైతే కామెంట్లు చేస్తున్నారో వారందరికీ ఒక్కటే చెప్పదలుచుకున్నాను. నేను మంత్రినే అయినా నాకంటూ కొన్ని ఇష్టాయిష్టాలు ఉంటాయి. మీకు నచ్చకపోతే నిరభ్యంతరంగా నన్ను ట్విటర్లో అన్‌ఫాలో అవ్వచ్చు’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.