తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించేలా భగవంతుడు దీవించాలని ప్రార్థించినట్లు చెప్పారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున శివాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగాన్ని సీఎం ఆదేశించారు.
