ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 10శాతం మాత్రమే అమలు చేశారని, మరోసారి సీఎంగా అవకాశం కల్పిస్తే అమలు చేస్తారని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనతో లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికి, ఏపీని అగ్రస్థానంలోకి తీసుకెళ్లేందుకు ఎంతో కృషి చేస్తున్నారు. కేంద్రం సహకరించడం లేదు, నిధులు లేకుండా ప్రాజెక్టులు, అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించామన్నారు. సీఎం దేవుడు కాదు కాదా..ఏపీ ప్రజలు రెండోసారి అవకాశం కల్పిస్తే అభివృద్ధి చేసి చూపిస్తారన్నారు. విభజన హామీలను అమలు చేయాలని నాలుగేళ్లుగా డిమాండ్ చేస్తున్నామని..28 సార్లు కేంద్రాన్ని ముఖ్యమంత్రి కలిశారని, నిధుల కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కేంద్రం స్పందించకుంటే మార్చి 5న ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. అయితే ఈ వాఖ్యలపై వైసీపీ నాయకులు మళ్లి అపద్దపు మాటలతో..అమలు కాని మామిలతో అధికారంలోకి రాలని..కొత్త డ్రామా అడుతున్నారని అంటున్నారు.
