కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 15 న కేంద్రప్రభుత్వం ఢిల్లీ లో సమావేశం నిర్వహించనున్నది.ఈ సమావేశానికి హాజరు కావలసిందిగా రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావుకు ఆహ్వానం అందింది.కేంద్రజలవనరుల మంత్రి గడ్కరీ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో రాష్ట్రాల నీటిపారుదల మంత్రులు, ఆయా రాష్ట్రాల ఇరిగేషన్, ఆర్ధిక శాఖల ప్రిన్సిపల్ కార్యదర్శులు,కేంద్ర జలసంఘం ఛైర్మన్, నాబార్డు ఛైర్మన్ తదితర ఉన్నతాధికారులు పాల్గొంటారు. దేశవ్యాప్తంగా ప్రాధాన్యక్రమంలో ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన కింద పూర్తి చేయతలపెట్టిన 99 సాగునీటి పథకాలు, అవసరమైన నిధులు, ఇప్పటివరకు నాబార్డు నుంచి అందించిన నిధులు ఇతర అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు.డిల్లీలోని శ్రమశక్తి భవన్ లో 15 వతేదీ మధ్యానం 1.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది.
