వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి రెడ్డి కి ఈ నెల 18న ఐపీఎస్ అధికారి సమీర్ వివాహం జమ్మూ కశ్మీర్ లో జరగనున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఆమె ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను మర్యాదపూర్వంగా కలిసి తన పెళ్లి శుభలేఖను అందజేశారు.తన వివాహానికి రావాలంటూ గవర్నర్ దంపతులను ఆమె ఆహ్వానించారు.రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో జరిగే విందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు, మంత్రులు, అధికారులు, పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ నెల 23న వరంగల్ లో, 25న హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఆమ్రపాలి, సమీర్ జంట హనీమూన్ నిమిత్తం 26వ తేదీన టర్కీ వెళ్లనున్న విషయం తెలిసిందే.
