తెలంగాణలో మరో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ తన అరంగేట్రం చేసింది. ప్రపంచ శ్రేణి ఏరో ఇంజిన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు అదిబట్లలో భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ప్రఖ్యాత జీఈ గ్రూప్ అండ్ టాటా గ్రూప్ హెచ్ఐసీసీలో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్ ,మహేందర్ రెడ్డి, టాటా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో విమాన విడిభాగాల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని అన్నారు. హైదరాబాద్‌లో ఇంత పెద్ద పరిశ్రమ నెలకొల్పింనందుకు టాటా అండ్ జీఈ గ్రూప్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన వివరించారు. భారత్‌లో ఏవియేషన్ రంగం మరింతగా అభివృద్ధి చెందుతోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఒక్క భారత్ మార్కెట్ కాకుండా మన ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఏవియేషన్ రంగంలో స్కిల్ అకాడెమీ, స్కిల్డ్ పర్సన్స్ ను తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు.