ఏపీ ప్రతిపక్ష నేత ,వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పాయాత్ర విజయ వంతంగా జరుగుతున్నది. ప్రజలు స్వచ్చందంగా వైఎస్ జగన్ కు బ్రహ్మరథం పడుతున్నారు. గత 4 ఏళ్లుగా టీడీపీ పాలన ఎలా ఉందో ప్రజలకు అర్థమయ్యోలా జగన్ వివరిస్తున్నాడు. ఈ క్రమంలో 83వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా దుండిగం క్రాస్ రోడ్డు నుంచి పాదయాత్ర ప్రారంభించిన వైఎస్ జగన్ సాయంత్రం కావలి నియోజవర్గం బోడగుడిపాడు బహిరంగ సభలో పాల్గొని నాలుగేళ్ల చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు. అడుగు అడుగునా వారు చేసే మోసలను ,మహిళలపై దాడులను,దోపిడిలను ఇలా ప్రతి నేరాలపై జగన్ విరుచుకుపడ్డాడు. అంతేగాక ఈ రోజు కాకపోతే ఏదోరోజు మనం ప్రత్యేక హోదాను తప్పకుండా సాధించుకోవాలని, ఊపిరి ఉన్నంతవరకూ ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడతానని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ‘తెలంగాణ కోసం ఆ ప్రాంత ప్రజలు కొన్నేళ్లపాటు ఎంతగానో శ్రమించి చివరికి అనుకున్నది సాధించుకున్నారు. మనం కూడా ప్రత్యేక హోదా కోసం పోరాడితే ఏదో ఓరోజు మన కష్టం ఫలిస్తుంది. ఏపీకి మంచి రోజులు వస్తాయ’న్నారు. ప్రత్యేక హోదా వచ్చిన తర్వాత అభివృద్ధి జరిగితే ప్రతి జిల్లా ఓ హైదరాబాద్‌లా తయారవుతుందని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు.
