అమలాపాల్ చక్కని అభినయంతో టాలీవుడ్ సినిమా ప్రేక్షకులకు దగ్గరైన ముద్దుగుమ్మ .అట్లాంటి ముద్దుగుమ్మతో లైంగికంగా వేధించడమే కాకుండా వ్యాపారం చేయాలనీ చూశాడు ప్రముఖ డాన్స్ స్కూల్ యజమాని అళగేశన్.అయితే అప్పట్లో ఈ వ్యవహారంపై పోలీసులకు కూడా పిర్యాదు చేసింది.
ఈ సందర్భంగా మలేషియాలో మహిళాభివృద్ధికి సంబంధించి డ్యాన్సింగ్ తమిళచ్చి అనే ప్రోగ్రాంలో పాల్గొనే టీ నగర్లో డాన్స్ స్కూల్ శిక్షణ తీసుకుంటున్నాను అని ..ఆ స్కూల్ నిర్వాహకుడైన అళగేశన్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అని పేర్కొంది.అంతే వెంటనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.
ఈ క్రమంలో నటుడు విశాల్ ప్రశంసలు కురిపించారు.ఎటువంటి భయం లేకుండా ధైర్యంగా పిర్యాదు చేసినందుకు హ్యాట్సాప్ చెబుతూ ఇలాంటి దారుణాలను బయటపెట్టాలంటే తెగింపు ఉండాలని మీటూ అనే హ్యాష్ ట్యాగ్ ను జోడిస్తూ మద్దతు తెలిపాడు .దీనిపై స్పందించిన అమలాపాల్ మాట్లాడుతూ నాతరపున మాట్లాడినందుకు ధన్యవాదాలు విశాల్ .ఇది ప్రతి ఒక్క మహిళ బాధ్యతగా భావిస్తున్నా ..లైంగిక వేధింపులపై మౌనంగా ఉంటూ వదిలేయడం సరికాదు అని నాకు తెలిసేలా చేశావు .అయితే అళగేశన్ నాతో వ్యాపారం చేయాలనీ అనుకున్నాడు అని ఆమె ట్వీట్ చేసింది.