జియో ఆఫర్ అమలులోకి వచ్చినప్పటి నుండి సంచలనాలు సృష్టిస్తుంది. ప్రస్తుతం జియో ఆఫర్ దెబ్బకి మిగిలిన కంపెనీలు అన్ని కిందికి దిగి వచ్చాయి, ఎయిర్ టెల్, ఐడియా, వోడా ఫోన్ వారు కొత్త కొత్త ఆఫర్స్ ని ప్రకటిస్తున్నారు. కానీ ఆ ఆఫర్స్ ఏమాత్రం జియో ఆఫర్ దగ్గరికి రాలేకపోతున్నాయి. ఒకటి తరువాత ఒకటి విడుదుల చేస్తునే ఉన్నారు. తాజాగా రిలయన్స్ జియో స్మార్ట్ ఫీచర్ ఫోన్లపై ఉచిత కాల్స్ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.1,500 డిపాజిట్ చేసి జియో ఫోను తీసుకుంటే మూడేళ్ల తర్వాత ఈ డిపాజిట్ సొమ్మును తిరిగి ఇచ్చేస్తుంది. కానీ ప్రతీ నెలా రూ.49 చెల్లిస్తే నెల రోజుల పాటు ఉచితంగా నిరంతరాయంగా మాట్లాడుకునే వెసులుబాటును కల్పిస్తోంది.
గతంలో కేవలం వాయిస్ కాల్స్‌కు మాత్రమే ఉపయోగించే ఈ ఫీచర్ ఫోన్ ద్వారా యూట్యూబ్, ఫేస్‌బుక్, గూగుల్ క్రోమ్‌లతో పాటు జియో టీవీ ద్వారా 450 ఛానళ్లను, జియో మ్యూజిక్ ద్వారా అనేక పాటలను వినవచ్చు. జియో ఎల్‌టీఈ టారిఫ్ ప్లాన్ ద్వారా వీడియోకాల్స్ చేసుకోవచ్చని రిలయన్స్ జియో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో లభించే ఈఫోన్‌లో మెమొరీని 128 జీబీ వరకు పెంచుకోవచ్చు.