తిరుమల శ్రీవారిని మంత్రి హరీష్ రావు దర్శించుకోన్నారు. ఇవాళ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకోని మ్రొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీవారి దివేనలతో కోటి ఎకరాల మాగాణి కాళేశ్వరం ప్రాజెక్టు సంకల్పం నెరవేరాలని వేడుకున్నారు…రెండు తెలుగు రాష్ట్రాలు దిన దినాభివృద్ది చెందుతున్నాయీ అన్నారు..రెండు రాష్ట్రాలు పరస్పర అవగాహన తో ముందుకెళ్ళాలి అని , సీఎం కేసీఆర్ తిరుమల సమానంగా యాదాద్రి ని అభివృద్ధి చేస్తున్నారు అని తెలిపారు…రాష్ట్రాలు ,తెలుగు రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు….నిన్న సాయంత్రం తిరుమలకు చేరుకున్న మంత్రికి టీటీడీ రిసెప్షన్ డిప్యూటీ ఈవో భాలాజి స్వాగతం పలికి బస,దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకులు మండపంలో వేద పండితులచే ఆశీర్వచనం అందించి,స్వామివారి తీర్దప్రసాదాలను,పట్టువస్త్రాలను అందజేశారు .
