నగరంలోని రోజు రోజుకు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడుతున్నవారిసంఖ్య నానాటికీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అంతేగాక, మద్యం మత్తులు డ్రైవింగ్ చేస్తూ యువతులు కూడా పోలీసులకు చిక్కుతుండటం గమనార్హం..తాజాగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్టులో శుక్రవారం అర్ధరాత్రి ఓ యువతి ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపింది. ట్రాఫిక్ పోలీసులకు చిక్కకుండా పారిపోయేందుకు ప్రయత్నించి ట్రాఫిక్ పోలీసులు వెంబడించేలా చేసింది. చివరికి పోలీసులకు ఆ యువతి కారును నిలిపి శ్వాస విశ్లేషణ పరీక్షలు చేసి కేసు నమోదు చేశారు. హైదర్‌గూడకు చెందిన కీర్తి అనే యువతి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు మీదుగా రోడ్డు నంబరు 1లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వైపు వచ్చింది. అక్కడే ఉన్న పోలీసులు కారును ఆపే ప్రయత్నం చేశారు. కారును నిలిపినట్లు నమ్మించిన ఆమె ఒక్కసారిగా కారు వేగాన్ని పెంచింది. పోలీసులు పట్టుకునేందుకు రోడ్డుకు అడ్డంగా బౌల్డర్లు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఛేజ్ చేసి కారును నిలువరించారు. శ్వాస విశ్లేషణ పరీక్షలకు సహకరించలేదు. చివరికి పరీక్షించగా 36 బీఏసీగా నమోదవడంతో కేసు నమోదు చేసిన పోలీసులు వాహనాన్ని సీజ్ చేశారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లలోని ఆరు ప్రాంతాల్లో చేసిన డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో మొత్తం 85 కేసులు నమోదయ్యాయి. ఇందులో మద్యం తాగి వాహనం నడుపుతున్న వాహనదారులకు చెందిన 42 కార్లు, 43 బైకులపై కేసులు నమోదు చేశారు. రేసింగ్‌లు, ప్రమాదకరంగా వాహనం నడుపుతున్న మరో రెండు కార్లను, రెండు ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Tags drunk and drive jublihilles police woman