వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకొని రెండువేల కిలోమీటర్ల వైపు పరుగులు పెడుతోంది. ఇక ప్రస్తుతం రాయలసీమలో ఉన్న నాలుగు జిల్లాలు చుట్టేసి.. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్ జగన్ మోహన్ రెడ్డి ఒకింత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నా రు. ఒకవైపు ప్రజలతో మమేకం అవుతూ… వారి సమస్యలను ప్రస్తావిస్తూనే మరోవైపు ఆయా నియోజకవర్గాల్లో నాయకుల పరిస్థితిని కూడా స్వయంగా అంచనా వేస్తూ అడుగులు వేస్తున్నారు.
see also : అత్యుత్తమ డిజైన్లు, సౌకర్యాలతో హైదరాబాద్‌లో కొత్త బస్టాపులు..కేటీఆర్
రాష్ట్ర రాజకీయాల్లో గుంటూరు జిల్లాకు అత్యంత కీలకమైన స్థానం ఉంది. అతిపెద్ద జిల్లా కావడంతో పాటు రాష్ట్రంలోనే అత్యధిక మునిసిపాలిటీలు కలిగిన జిల్లాగా గుంటూరుకు గుర్తింపు ఉంది. అలాంటి జిల్లాలో గుంటూరు ఎంపీ స్థానం అంటే కూడా చాలా పోటీ ఉండడమే కాకుండా… ఇది చాలా ప్రతిష్ఠాత్మకమైన స్థానం. రాయపాటి సాంబశివరావు లాంటి దిగ్గజాలు ఇక్కడ సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నారు. అయితే ఇటీవల రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ నుంచి పోలవరం ప్రాజెక్టులో కొంత కాంట్రాక్టును నవయుగ సంస్థకు కట్టబెట్టడంతో ఆయన టీడీపీ సర్కారు మీద కినుకతో ఉన్నట్లు తెలుస్తోంది.
see also : రాజకీయాలను షేక్ చేస్తున్న జగన్ తాజా ట్వీట్…
ఇలాంటి లుకలుకల మధ్య ప్రముఖ విద్యాసంస్థల అధినేత వారసుడైన లావు శ్రీకృష్ణ దేవరాయను వైసీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల గుంటూరు జిల్లాకు చెందిననేతలతో పాటు ముఖ్యులతో సమావేశం అయిన సందర్భంగా ఈ విషయం చెప్పినట్టు తెలుస్తోంది. మరి జగన్ పాదయత్ర గుంటూరుకు చేరుకోగానే ఫైనల్ డిసిషన్ తీసుకోనున్నారని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
see also : మరోసారి తండ్రి కోడుకులకు లెక్కలతో చుక్కలు చూపించిన డోన్ వైసీపీ ఎమ్మెల్యే