2014 సాధారణ ఎన్నికలకు ముందు వరకు ఈ పేరు రాష్ట్ర రాజకీయాలకు కొత్త. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైయస్ జగన్ కొత్త పార్టీ పెట్టేదాకా ఈ పేరు ఎవరికి తెలియదు. పార్టీ ఆవిష్కరించిన వైయస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా చేపట్టిన పర్యటనలో భాగంగా కర్నూలు జిల్లాలో 2012లో ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అపట్టో నిజంగానే అది ఒక పెద్ద సంచలనం. సాధారణ ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉన్నప్పటికీ, వైసీపీ తరుపున అసెంబ్లీలో ఎన్నికల్లో పోటీ చేసే తొలి అభ్యర్ధిని వైసీపీ అధినేత వైయస్ జగన్ ప్రకటించారు. ఓ బహిరంగ సభలో డోన్ నియోజకవర్గ టిక్కెట్‌ను బుగ్గనకు ఇవ్వనున్నట్లు జగన్ ప్రకటించారు. ఆ తర్వాత 2014లో వచ్చిన సాధారణ ఎన్నికల్లో ముందుగానే ప్రకటించిన హామీ మేరకు బుగ్గన రాజేంద్రనాథ్‌కు డోన్ అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. తొలిసారిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన బుగ్గన తన ప్రత్యర్ధి టీడీపీ సీనియర్ నేత, ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రతాప్‌పై విజయం సాధించారు. నిజానికి అప్పటివరకు డోన్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంది. అలాంటి డోన్ నియోజకవర్గంలో 1,152 ఓట్ల మెజారిటీతో కేఈ ప్రతాప్‌పై గెలుపొంది తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆ తర్వాత గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బుగ్గన చేసిన ప్రసంగం అటు వైసీపీతో పాటు టీడీపీని సైతం ఆకట్టుకుంది.అసెంబ్లీలో తన మాట తీరుతో అందరినీ ఆకట్టుకున్న ఎమ్మెల్యే బుగ్గనకు ఆర్థిక వ్యవహారాలు, బడ్జెట్ వంటి అంశాలపై మంచి పట్టు ఉంది. ఇకపోతే తాజాగా మరోసారి చంద్రబాబు పాలనపై విరుచుకు పడ్డాడు.
see also..వైఎస్ జగన్ స్ఫూర్తితోనే.. ”భరత్ అనే నేను”
ఈనెల 9న శుక్రవారం హైదరాబాద్‌లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ. టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అవకాశవాదానికి నిజమైన అర్థం చంద్రబాబేనని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు చంద్రబాబుకు పట్టవని, ఆయన పాలనే రాష్ట్రానికి దురదృష్టకరమని ధ్వజమెత్తారు. చంద్రబాబు అబద్ధాల వల్లే రాష్ట్రానికి వచ్చే నిధులు వెనక్కి వెళ్లాయన్నారు. చంద్రబాబు పాలనే రాష్ట్రానికి సగం అరిష్టమని ధ్వజమెత్తారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పోరాటం విషయంలోనూ చంద్రబాబు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. అంతేగాక ఈయనే అనుకుంటే..ఈయన కొడుకు నారా లోకేష్ ఇంకా దారుణం అన్నారు. ఏపీలోనే అన్ని అమలు గాని అపద్దపు హామిలు ఇచ్చి మోసం చేశారు..కాని ఆమోరికలో కూడ టీడీపీ గెలుస్తుంది అంటే ..ఏమనాలి ఇంకా అని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు.. వీడియో చూడండి..