తన స్వార్ధం కోసం ఒక స్పష్టత లేని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ప్రజలను మోసం చేసేందుకు, అదే విధంగా ప్రత్యేక హోదా పేరిట తన హోదాను నిబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న వైఎస్ జగన్‌కు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హతే లేదని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. మాట తప్పను.. మడమ తిప్పను అన్న జగన్ మోహన్‌రెడ్డి పార్టీ వాళ్లు రాజీనామాలు చేసి ఉంటే ప్రజలు నమ్మేవారన్నారు. ప్రజలను ఇంకా మోసం చేయాలన్నటువంటి ఆలోచనలను మానేసి, కేసుల నుంచి విముక్తి చెందేందుకే ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నారని విమర్శించారు.
