అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే ఆయన చనిపోయి ఇన్నేండ్లు అయిన కానీ ఐదున్నర కోట్ల ఆంధ్రుల గుండెల్లో చెరగని అభిమానాన్ని సంపాదించుకున్న మహానేత.ఇప్పటికి ఏపీలో ప్రతి ఒక్క ఇంట్లో కాకపోయిన గ్రామంలో అత్యధికంగా ఇండ్లల్లో వైఎస్సార్ బొమ్మ ఉంటది అంటే అతిశయోక్తి కాదేమో.అంతగా ఆయన ప్రజానేతగా ..ముఖ్యమంత్రిగా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.అయితే అప్పట్లో తొమ్మిది యేండ్ల టీడీపీ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని ..ప్రజలను కష్టాలను తెలుసుకొని వాటిని పరిష్కరించాలని అప్పట్లో మహానేత వైఎస్సార్ పాదయాత్ర చేసిన సంగతి తెల్సిందే.
పాదయాత్ర దెబ్బతో టీడీపీకి ప్రతిపక్ష హోదా దక్కకపోవడం ..కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజారిటీతో గెలుపొంది వైఎస్సార్ ముఖ్యమంత్రిగా పదవీ భాద్యతలు స్వీకరించారు.ఆ తరుణంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పాదయాత్రకు సంబంధించి ఫోటో ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు.ఈ ఎగ్జిబిషన్ కు వైఎస్సార్ వెళ్లారు.వెళ్ళిన తర్వాత ఆయన ఫోటోలను చూస్తుండగా మొదటి ఫోటో దగ్గర నుండి లాస్ట్ ఫోటో వరకు ఒక వ్యక్తి వైఎస్సార్ ను విడవకుండా పాదయాత్ర ముగిసే వరకు ఉన్న విషయాన్నీ వైఎస్సార్ గమనించారు.ఆ ఫోటోలలో వ్యక్తి వైఎస్సార్ పక్కన ఉన్న ..కొన్ని ఫోటోలలో వైఎస్సార్ పాదాలను వత్తుతున్న ఫోటోలు ..ఇంకోన్ని ఫోటోలలో వైఎస్సార్ కు బూట్లు వేస్తున్న ఫోటోలు .మరి కొన్ని ఫోటోలలో మంచినీరు అందిస్తూ.. ఇలా కనిపించాడు.
అతను ఎవరో వైఎస్సార్ కు తెలియదు. అతను ఎవరో కాంగ్రెస్ కార్యకర్త ఏమో అనుకున్నాడు. చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు తీసిన అన్ని ఫోటోలలో ఆ వ్యక్తి కనిపించాడు. “ఎవరు ఇతను?” అడిగాడు పక్కనున్న కార్యకర్తలను. అందరూ తమకు తెలియదు అంటే తమకు తెలియదు అని బదులిచ్చారు. ఆశ్చర్యపోయాడు వైఎస్సార్.. తనకు తెలియదు, కార్యకర్తలకు తెలియదు… మరి ఎవరు? ఎందుకు తనను అనుసరించాడు అన్ని రోజులు? పాదయాత్ర తరువాత అతను మళ్ళీ కనిపించలేదు.ఆ ఫోటోల ఆధారంగా, అతను ఎవరో, ఏ వూరో, ఎందుకు తన వెంట ఉన్నాడో, ఇరవై మూడు జిల్లాల్లో ఎక్కడున్నా ఆరా తీసి తన సముఖానికి తీసుకుని రావాల్సిందిగా ఆదేశించాడు.అంతే.. అతని ఫోటోలు పట్టుకుని కార్యకర్తలు వేట మొదలు పెట్టారు. ఏవూళ్ళో అడిగినా అతని ఆచూకీ దొరకలేదు. కొన్నాళ్ల తరువాత నెల్లూరు జిల్లాలో ఒక గ్రామ వాసి అతడిని గుర్తుపట్టి అతని వివరాలు చెప్పాడు. స్థానిక నాయకులు అతని ఇంటికి పరుగుతీశారు. తీరా చూస్తే అతను యాదవ కులానికి చెందిన పశువుల కాపరి. పూరిగుడెసె లో నివసించే అతి పేదవాడు.
ఎందుకు వైఎస్సార్ వెంట తిరిగావు అని ప్రశ్నించారు నాయకులు.”నాకు చాలారోజులనుంచి వైఎస్సార్ అంటే అభిమానం. ఆయన పాదయాత్ర చేస్తున్నాడని తెలిసి ఆయనకు సాయంగా ఉండాలని నిర్ణయించుకుని ఒకరోజు ముందు చేవెళ్ల వెళ్లాను. అక్కడినుంచి గుంపులో కలిసి ఆయనతో తిరిగాను. ఆయనకు వడదెబ్బ కొట్టినప్పుడు సేవ చేసే అవకాశం లభించింది. ఆయనకు మంచినీళ్లు అందించే అదృష్టం దొరికింది. పాదయాత్ర అయిపోగానే నేను నా ఇంటికి వచ్చాను. అంతే తప్ప మరేమీ లేదు” చెప్పాడు అతను భయపడుతూ.వెంటనే అతడిని నాయకులు హైద్రాబాద్ తీసుకుని వచ్చారు. వైఎస్సార్ ఇంటికో, లేక గాంధీ భవన్ కో తీసుకెళ్లి వైఎస్సార్ ముందు నిలబెట్టారు. అతను ముందే అతని గూర్చి వివరాలు అందించారు వారు. అతన్ని చూడగానే వైఎస్సార్ లేచి ఎదురు వచ్చి అతడిని గట్టిగా కౌగలించుకుని అతడు చూపించిన అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. సాక్షాతూ ముఖ్యమంత్రి తనను కౌగిలించుకోవడం తో అతను సంభ్రమాశ్చర్యాలకు గురి అయ్యాడు. దేహమంతా చిగురుటాకు లా వణికి పోయింది.
తన పక్కనున్న స్నేహితుడితో ఒక ఆరు అంకెల భారీ ఎమౌంట్ ను చెప్పి “రెండు నెలల పాటు తన వృత్తి, వ్యాపారం, భార్యా పిల్లలను సైతం వదిలేసి నా వెంట తిరిగాడు. ఏమిచ్చినా అతని ఋణం తీర్చుకోలేము. ఆ అమౌంట్ అతని పేరుతో ఫిక్సెడ్ డిపాజిట్ చేసి ఆ వడ్డీ తో జీవితాంతం సుఖంగా జీవించే ఏర్పాటు చెయ్యండి” అని కోరాడు.ఆ ఆదేశం గంటల్లో అమలు అయింది.దీంతో అధికారం ఉన్నప్పుడు, పదవులు ఉన్నప్పుడు బెల్లం చుట్టూ ఈగల్లా ప్రతి ఒక్కరూ మూగుతారు. డబ్బున్న వారికి లోకమంతా బంధువులే ఉంటారు. డబ్బు, అధికారం పోయినపుడు భార్యా పిల్లలు కూడా విలువ ఇవ్వరు. మనం నిర్భాగ్యులు గా ఉన్నప్పుడు మన వెంట ఉండేవారే మన ఆత్మీయులు. ప్రజానాయకుడికి బలం కండల్లోనూ, పిక్కల్లోనూ ఉండదు. తనకోసం ప్రాణం ఇచ్చే అభిమానుల్లో ఉంటుంది. అలాంటి అభిమానులను తయారు చేసుకోవడంలోనే నాయకుడి సమర్ధత, చాకచక్యం నిబిడీకృతంగా ఉంటాయి అని నేటి రాజకీయ నేతలకు ఘనంగా చాటి చెప్పాడు వైఎస్సార్ …అందుకే Thats YSR..