ఏపీ రాజకీయాల్లో సినీ ప్లేవర్ రోజురోజుకీ ఎక్కువ అవుతోంది. అధికార టీడీపీకి ఇప్పటికే సినీ గ్లామర్ ఉండగా.. ప్రతిపక్ష వైసీపీ కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే… వైసీపీలోకి గత కొంతకాలంగా ఓ ప్రముఖ దర్శకుడు చేరుతారని వార్తలు వైరల్ అవుతున్నాయి.
see also : రాజీనామాలు చేద్దాం రండి ..ప్రత్యేక హోదా ఎలా రాదో చూద్దాం .బాబుకు జగన్ సవాలు ..
ఆయన ఎవరోకాదు చాగల్లు నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మాస్ దర్శకుడు వివి వినాయక్.తాజాగా ఆయన రాజకీయాల్లోకి వస్తారు అని, అది కూడా వైసీపీలో చేరుతారనే వార్తలు సోషల్ మీడియాలో హాల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఆ వార్త పై వినాయక్ ఫ్యామిలీ నుండి మాత్రం స్పందన రాలేదు. వినాయక్ తండ్రి రాజకీయాల్లో చురుకుగా ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన పనిచేశారు.. ఇక అక్కడ జమిందారులుగా ఆయనకు క్రేజ్ ఉంది..
see also : రాజకీయాలను షేక్ చేస్తున్న జగన్ తాజా ట్వీట్…
పేరు ప్రఖ్యాతలు కూడా ఉన్నాయి. అయితే సంవత్సరానికి ఓ సినిమా చేస్తూ వినాయక్ రాజకీయాల్లో తన సత్తా చాటాలని అనుకుంటున్నారనే వార్త గోదావరి జిల్లాల నుంచి పాకడంతో.. ఏపీ అంతా వైరల్ అయింది. ఇక అందుకే ఆయన తాజాగా తెరకెక్కించిన సినిమా ఇంటిలిజెంట్ ఆడియో ఫంక్షన్ రాజమండ్రిలో జరిపారని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మరి ఈ వార్త పై వినాయక్ ఫ్యామిలీ గానీ.. వైసీపీ వర్గీయులు గానీ స్పందిస్తే తప్ప ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియదని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
see also :మరోసారి తండ్రి కోడుకులకు లెక్కలతో చుక్కలు చూపించిన డోన్ వైసీపీ ఎమ్మెల్యే