మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా నటించిన తొలిప్రేమ చిత్రం ఈ శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిషో నుండే పాజిటీవ్ టాక్ తెచ్చుకోవడంతో రాశీ ఖాతాలో ఓ హిట్ పడ్డట్టే అనుకోవచ్చు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే.. రాశీ ఖన్నా గురించి గత కొద్ది రోజులుగా ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. టీమిండియా క్రికెటర్‌తో ఆమె ప్రేమలో పడిందనే వార్త దేశవ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చింది. ఫాస్ట్ బౌలర్ బుమ్రాపై రాశి మనసు పారేసుకుందనే న్యూస్ వైరల్‌గా మారింది.
see also : అను బేబి.. అలాంటి పనులు చేయకూడదమ్మా..!
సినిమా హీరోయిన్లు క్రికెటర్లతో ప్రేమలో పడటం చాలా కాలంగా ఉన్నదే. టౌగర్ పటౌడీ-షర్మిలా ఠాగూర్ నుంచి కోహ్లి-అనుష్క శర్మ వరకు ఇలా ఎంతో మంది సినిమా హీరోయిన్లు క్రికెటర్లను ప్రేమించి పెళ్లాడారు.దీంతో వీరి కోవలోకే రాశీఖన్నా-బుమ్రా జోడి వస్తుందా.. అనే విషయం ఆసక్తి రేపింది. కొద్ది రోజుల క్రితం హిందీ మీడియాతో మాట్లాడిన రాశీ ఖన్నా.. తను టీమిండియా ఆడే క్రికెట్ మ్యాచ్‌లు తప్పకుండా చూస్తానని చెప్పింది. బుమ్రా బౌలింగ్‌కు వీరాభిమానని ఆమె చెప్పుకొచ్చింది. అక్కడితో ఆగిపోకుండా.. బుమ్రా బౌలింగ్ కోసమే తను క్రికెట్ మ్యాచ్‌లు చూస్తానని, అతడి బౌలింగ్ అంటే అంత ఇష్టమని చెప్పుకొచ్చింది.
see also :అనంతపురంలో 250 కోట్ల అవినీతికి టీడీపీ నేతలు కుట్ర..కని పెట్టిన వైసీపీ ఎమ్మెల్యే
సోషల్ మీడియాలోనూ బుమ్రా బౌలింగ్‌పై ఆమె ప్రశంసలు గుప్పించింది. దీంతో మరో నటి క్రికెటర్‌తో ప్రేమలో పడిందా అనే అనుమానాలు తలెత్తాయి. అయితే అదే విషయం ఆమె దగ్గర ప్రస్తావిస్తే.. అందతా వట్టిదే అని… అవి ఎలాంటి ఆధారం లేని రూమర్లు అని కొట్టి పారేసింది. తొలి ప్రేమ విడుదలకు ముందు శుక్రవారం అభిమానులతో చాట్ చేసిన రాశీ ఖన్నా.. తను పర్సనల్ లైఫ్‌లో ఇప్పటికే తొలి ప్రేమను ఆస్వాదించానని చెప్పుకొచ్చింది.