వైసీపీలోకి మోహన్ బాబు..! కన్ఫాం చేసిన గాయత్రి మూవీ..!!
తెలుగు సినీ ఇండస్ర్టీ సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మంచు మోహన్‌బాబు వైసీపీలో చేరనున్నారా..? మళ్లీ రాజకీయాల్లోకి వచ్చి పొలిటికల్‌గా చక్రం తిప్పుతారా..? ఇప్పటి వరకు మోహన్‌బాబు రాజకీయ రీ ఎంట్రీపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడినట్లేనా..? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తోంది గాయత్రి మూవీ.
అయితే, నటుడు మోహన్‌బాబు, విష్ణు కాంబోలో తెరకెక్కిన చిత్రం గాయత్రి శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. గాయత్రి మూవీలోని కొన్ని డైలాగ్స్ మంచు మోహన్‌బాబు వైసీపీలో చేరబోతున్నారా..? అన్న ప్రశ్నకు అవుననే సమాధానం చెబుతున్నాయి. ఇంతకీ ఆ డైలాగ్‌లను పరిశీలిస్తే.. భూ సేకరణ అనేది రియల్ ఎస్టేట్ కోసమే.. (అయితే, చంద్రబాబు రాజధాని కోసం భూమి ఇవ్వాలంటూ కోట్లు విలువ చేసే భూములను రైతులను బెదిరించి, మభ్యపెట్టి, టీడీపీ నాయకులే రౌడీల్లా వ్యవహరించి.. అమరావతి కోసం భూములు ఇవ్వాలంటూ రైతుల నుంచి.. భూములు లాక్కున్న విషయం తెలిసిందే.) మరో డైలాగ్‌ను పరిశీలిస్తే.. చంద్రబాబు నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నేను వేసిన రోడ్లు, నేను ఇస్తున్న రేషన్ బియ్యం తింటూ నాకు ఓట్లేయరా..? అంటూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ మాట్లాడిన మాటలనుద్దేశించి మరో డైలాగ్ ఉంది. అంతే కాకుండా, సినిమాను సైతం నిశితంగా పరిశీలిస్తే నోటుకు ఓటు కేసుకు సంధించి కూడా ఓ డైలాగ్ ఉందని, ఆ డైలాగ్‌ను సెన్సార్ సభ్యులు తొలగించినట్లు సమాచారం. సెన్సార్ సభ్యులు తొలగించిన ఆ డైలాగ్ సీన్‌ను ఇట్టే ఈజీగా కనిపెట్టొచ్చు.
అంతేగాక, ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ మోహన్‌బాబు అధికార పార్టీ టీడీపీపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ప్రజలు ఎవరికి ఓటేసింది..? పలాన పార్టీ అని మీకు ఓటేస్తే..!! గెలిచిన తరువాత వేరే పార్టీలోకి వెళ్లడం నీచత్వం, నికృష్టం అంటూ ఫిరాయింపు ఎమ్మెల్యేలనుద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచిన తరువాత ఆ పార్టీ ఇష్టం లేకపోతే రిజైన్ చెయ్యాలి. అంతేకానీ డబ్బుపై మమకారం పెంచుకుని వేరే పార్టీలోకి వెళ్లడం సరైంది కాదంటూ తన అభిప్రాయాన్ని చెప్పారు మంచు మోహన్‌బాబు.
ఇదిలా ఉండగా.. మంచు విష్ణు సతీమణి వైఎస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి. ఆ పెళ్లి తరువాత మంచు మోహన్ బాబు వైసీపీలో చేరడం కన్ఫాం అంటూ అప్పట్లో పెద్ద ప్రచారమే జరిగింది. ఈ క్రమంలో ఆచితూచి వ్యవహరిస్తూ వచ్చారు మోహన్‌బాబు. అయితే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలించిన మోహన్‌బాబు తన గాయత్రి సినిమాతో వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.