తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికి సురక్షిత మంచినీటిని అందించాలని చేపట్టిన మిషన్ భగీరథ పథకం తీరుతెన్నులను చూసి తెలుసుకోవటానికి కేంద్ర ఆర్ధిక శాఖ కార్యదర్శి అరవింద్ మెహత సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కోమటిబండలో ఉన్న పైలాన్ ను ఆయన సందర్శించారు. ఆయనతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే.జోషి ఉన్నారు. మంచినీటిని అందించాలన్న ఆలోచన చాలా గొప్పదని అరవింద్ మెహత ప్రశంసించారు. ఎస్.కే.జోషి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రాలకు ఎంత డబ్బు కేటాయించాలి, ఏ ప్రాతిపదికన, ఏ ఫార్ముల ప్రకారం ఇవ్వాలనే నిర్ణయం ఆర్ధికసంఘం నిర్ణయిస్తుందన్నారు.
