తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం సమీపంలోని కీసరగుట్ట పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని లక్షలాదిభక్తులు రానున్నందున మేడ్చెల్ జిల్లా అధికారులు అనేక ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఎం.వి.రెడ్డి ఒక ప్రకటన నేడు విడుదల చేసారు. 11వ తేదీనుంచి 14వ తేదీవరకు ఉదయంనుంచి సాయంత్రం అన్ని వేళలలో వేద పారాయణం తో పాటు శివపంచాక్షరి సహా అనేక ఆరాధనలు జరగనున్నాయి. ఈ నాలుగు రోజులలో స్థానికంగా సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా పోటీల నిర్వహణకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసామని ఆయన తెలిపారు. భక్తులకు ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం వసతి సౌకర్యాలతో పాటు రవాణా, వైద్యం, నీటి వసతి కల్పించడానికి ఏర్పాట్లు చేసింది.
Tags kisara shivaratri