వైసీపీ అధినేత జగన్ ప్రారంభించిన పాదయాత్ర దేశ రాజధాని ఢిల్లీని టచ్ చేసిందనే రాజకీయ వర్గాల్లో ఓ వార్త హాట్ టాపిక్ అయ్యింది. 2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర చేపట్టారు. గత నవంబరు 6న ప్రారంభమైన ఈ పాదయాత్ర వెయ్యి కిలోమీటర్ల దూరం పూర్తి చేసుకుంది. అదేవిధంగా నాలుగు జిల్లాలను సైతం ఈ పాదయాత్ర చుట్టి వచ్చింది. మొత్తంగా సీమలో పూర్తయిపోయింది. ప్రస్తుతం నెల్లూరులో ఈ పాదయాత్ర బ్రహ్మాండంగా సాగుతోంది. ఈ పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి ఆశించిన దానికన్నా కూడా ఎక్కువగా ఆదరణ లభిస్తోంది. మహిళలు, వృద్ధులు, కార్మికులు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాలూ జగన్ వెంట మేమున్నామంటూ పాదం కదుపుతున్నారు.
see also : నాడు కాగ్ చెప్పింది.. నేడు బీజేపీ ఇరికించింది.. చంద్రబాబు గారు ప్లాన్ ఏంటి..?
జగన్‌కుతోడుగా ఉన్నామంటూ జై కొడుతున్నారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలను జననేత దృష్టికి తీసుకువస్తున్నారు. తమకు పింఛన్లు అందడం లేదని, తమ సమస్యలు పరిష్కరించాలని జగన్‌కు వివరిస్తున్నారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వానికి చెప్పినా ఎలాంటి సమస్యా తీరదని, కేవలం టీడీపీ నేతలు, వారి అనుచరుల కోసమే చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తోందని జగన్ ప్రజలకు వివరిస్తున్నారు. అదేసమయంలో తన ప్రభుత్వం వస్తే.. అన్ని సామాజిక వర్గాలకూ న్యాయం చేస్తుందని, అన్ని వర్గాలనూ కలుపుకొని పోతుందని కూడా జగన్ అంటున్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అన్ని సామాజిక వర్గాలకూ న్యాయం చేస్తానని, హామీలను అమలు చేస్తానని జగన్ భరోసా కల్పిస్తుండడం ప్రజలు ఒకింత ఊరడ చెందుతున్నారు.
see also :టీడీపీ కంచుకోటలో.. జగన్ దూకుడు.. వైసీపీ ఎంపీ ఖరారు..?
ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే.. జగన్ పాదయాత్ర విషయంపై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ వివరంగా తెలుసుకున్నారు.పాదయాత్ర ప్రారంభించిన సమయంలో జగన్ ఒకింత నలతకుగురైనట్టు వార్తలు వచ్చాయని, అయినా నడుస్తున్నట్టు తెలుసుకున్నానని, ఇప్పుడు ఆయన ఆరోగ్యం ఎలా ఉంది… ఎన్ని రోజులు ఈ పాదయాత్ర సాగుతుంది. ప్రజల స్పందన ఎలా ఉంది.. రోజుకు ఎంత దూరం నడుస్తున్నారు.. అని రాష్ట్రపతి చాలా ఆసక్తిగా ప్రశ్నించినట్టు వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. ప్రస్తుతం పార్లమెంటులో ఏపీ విభజన చట్టం అమలు కోసం ఉద్యమిస్తు న్న వైసీపీ ఎంపీలు.. ఇదే విషయంలో టీడీపీ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిపైనా విమర్శలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్డీయే ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వం పై పోరాటం ఏంటని వైసీపీ టీడీపీ పై ఫైర్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయా అంశాలపై రాష్ట్రపతికి వివరించేందుకు విజయసాయి.. రాంనాథ్‌ను కలిశారు. ఈ సందర్భంగా జగన్ విషయం కూడా ప్రస్తావనకు రావడంతో రాష్ట్రపతి చాలా ఆసక్తిగా పాదయాత్ర గురించి తెలుసుకున్నారని సమాచారం. దీంతో జగన్ పాదయాత్ర ఢిల్లీని టచ్ చేసిందని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.