తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీ ఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దేశ రాజధాని డిల్లీ కి వెళ్లారు.నిన్న సాయంత్రం ( శుక్రవారం ) హైదరాబాద్ మహానగరంలోని బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో ఆయన సతీమణి శోభ, ఇతరులు కూడా బయల్దేరారు.అయితే గత నాలుగు రోజులుగా పంటి నొప్పితోబాధపడుతున్న కేసీఆర్.. చికిత్స నిమిత్తం హస్తినకు వెళ్లినట్లు సమాచారం.ఈ క్రమంలో డిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను సీఎం కేసీఆర్ కలుసుకునే అవకాశముంది. ఇటీవల కేంద్ర బడ్జెట్లో తగినన్ని కేటాయింపులు లేకపోవటం రాష్ట్ర ప్రభుత్వం ఆశలను నీరుగార్చింది. ఈ నేపథ్యంలో బడ్జెట్ కేటాయింపులతోపాటు, కేంద్రం ఇచ్చిన హామీలు, రావాల్సిన నిధులు, ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న ‘విభజన’ అంశాలను సీఎం ఈ సందర్భంగా ప్రస్తావించే అవకాశాలున్నాయి అని సమాచారం.