గడ్డలుమీసాలు పెంచితే 70 సీట్లు గెలుస్తారా..? దమ్ముంటే ఏడు సీట్లు గెలవాలంటూ ఉత్తమ్‌కుమార్ రెడ్డి కి రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ చేశారు. ఇవాళ మంత్రి తలసాని తెలంగాణ భవన్‌లో మీడియాతోమాట్లాడుతూ… ఉత్తమ్‌కుమార్ రాజకీయం ముగింపు దశకు వచ్చిందన్నారు. ఉత్తమ్‌కుమార్ జ్ఞానముండి మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు. ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మట్లేదని.. కాంగ్రెస్ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని తలసాని హెచ్చరించారు. గొల్లకుర్మలకు రూ. 45 లక్షలు ఇచ్చామని గుర్తు చేశారు. పేదలు గొప్పగా బతకాలనే ఉద్దేశంతోనే డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో హాస్టల్ విద్యార్థులకు తూకం వేసి అన్నం పెట్టారని.. కానీ తమ ప్రభుత్వం కడుపు నిండా సన్న బియ్యంతో అన్నం పెడుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తేల్చిచెప్పారు.
