ఓటుకు కోట్లు కుమ్మరిస్తూ పోలీసుల స్టింగ్ ఆఫరేషన్‌లో అడ్డంగా దొరికిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికీ ప్రత్యేక హోదా గళమెత్తడం లేదు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే కలిగే లాభాలతో తమ బతుకులు మారుతాయన్న రాష్ట్ర ప్రజల ఆశలపై నీళ్లు చల్లారు.
ఇదిలా ఉండగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన అనుకూల సోషల్ మీడియా ద్వారా ప్రత్యేక హోదా బదులు.. ప్రత్యేక ప్యాకేజీ పోస్టులను ప్రచారంలోకి తెచ్చారు. 2014 సెక్షన్ 46 (1) ప్రకారం ప్రత్యేక గ్రాంట్, అలాగే ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వాలని, ప్రత్యేక ప్యాకేజీలో పేర్కొన్న అంశాలన్నీ అమలు చేయాలని, ప్రత్యేక హోదా అంశానికి పాతరవేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేలా తన అనుకూల మీడియాతో చంద్రబాబు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
మరోవైపు వ్యాప్తంగా మోడీ సర్కార్, చంద్రబాబు సర్కార్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీతోపాటు వామపక్ష పార్టీలు ఏపీ వ్యాప్తంగా నిరసనలు తెలిపిన విషయం తెలిసిందే. అయినా చంద్రబాబు ధోరణిలో మార్పురాకపోగా.. అసలు ఏపీలో ఏం జరిగితే నాకేపోయిందిలే.. అన్నట్లు వ్యవహరించడంపై ఏపీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
SEE ALSO : స్టార్ హీరోతో అనసూయ ఎఫైర్..! ఫోటోలతో సహా బయటపెట్టిన ఆరేళ్ల బాలుడు..!!
అయితే, ప్రత్యేక హోదా వస్తే కలిగే లాభాలు మరోసారి మీ కోసం..:
ప్రత్యేక హోదాయే రాష్ట్రానికి సంజీవని – విబజనతో ఆర్థికంగా కుదేలయిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే అది ఒక్క ప్రత్యేక హోదాతోనే సాధ్యమవుతుంది.
మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ప్రయోజనలు ఎక్కువగా ఉంటాయి.
ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్ర నిధులు 90శాతం గ్రాంట్లుగాను, 10 శాతం అప్పుగాను వస్తాయి. గ్రాంట్ల ద్వారా వచ్చిన వచ్చిన సొమ్మును తిరిగి చెల్లించనక్కర్లేదు.
ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రా్లలోని పరిశ్రమలకు భారీగా రాయితీలు ఇస్తారు. వంద శాతం ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు లభిస్తుంది
ఇన్‌కమ్ ట్యాక్స్‌లో కూడా వంద శాతం రాయితీ ఉంటుంది. పన్ను మినహాయింపులు, ప్రైట్ రీయింబర్స్‌మెంట్ లు దక్కితే.. పారిశ్రామికవేత్తలు రెక్కలు కట్టుకొని వచ్చి వాలిపోతారు. పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏపికి తరలివస్తాయి
ప్రత్యేక హోదాతో పెద్ సంఖ్యలో పరిశ్రమలు వస్తాయి. లక్షల సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు స్థానికులకు, యువతీ యువకులకు దక్కుతాయి. ఇవేకాక ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి, ప్రజలకు కలిగే లాభాలు మరెన్నో…