దేశ రాజధాని ఢిల్లీలో వైసీపీ ఎంపీ వియసాయిరెడ్డి ఏపీలో అధికార పార్టీ అయిన టీడీపీపై సంచలన ఆరోపణలు చేశారు. మరో సారి టీడీపీ ఫార్టీ ఫిరాయింపులకు భారీ కుట్రకు తెరలేపుతున్నారని ఆరోపించారు.ఇదే విషయంపై రాష్ర్టపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలసి ఫిర్యాదు చేశారు. 2014లో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు గనుక అధికార పార్టీ అయిన టీడీపీలోకి వస్తే ప్రతీ ఎమ్మెల్యేకు రూ. 25 కోట్లు ఇస్తామని టీజీ వెంకటేశ్ ఆఫర్ చేసినట్లు మండిపడ్డారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టుతో పాటు ఎన్నికల ఖర్చు మొత్తం పెట్టుకుంటామని ఆఫర్ చేస్తున్నట్లు రెడ్డి ధ్వజమెత్తారు. సమయం వచ్చినపుడు టీజీ వెంకటేశ్, టీడీపీ బండారం మొత్తాన్ని బయటపెడతానని హెచ్చరించారు. ఇదే విషయాన్ని ఎన్నికల కమీషన్ కు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
see also..ఏపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా స్కెచ్ …వైసీపీలోకి టీడీపీ మాజీ మంత్రి …..!
కేంద్ర ప్రభుత్వంలో ఉన్న టీడీపీ మంత్రులు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని, రాష్ట్రపతి ప్రసంగాన్ని కేబినెట్ లో ఆమోదించిన తర్వాత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 74,75 ను వారు అతిక్రమిస్తున్నారనే విషయాన్ని కోవింద్ కు వివరించి చెప్పినట్టు పేర్కొన్నారు. ఇంకా ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర బాగోగులు గురించి..జగన్ ఆరోగ్యం గురించి రామ్ నాథ్ అడిగారని వైసీపీ ఎంపీ వియసాయిరెడ్డి తెలిపారు.