ఏపీలో టీడీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతీరేకత ఉండండతో వచ్చే ఎన్నికల్లో ఇక గెలవడం కష్టం అని తెలిసి ఎలాంటి మోసలకు తెరలేపిందో వైసీపీ నేతలు బట్టబయలు చేశారు. ఎక్కడైయితే వైసీపీ బలంగా ఉందో ఆ నియోజకవర్గాలలో ఓట్లను గల్లంతు చేస్తున్న తీరుపై ఆ వైసీపీ పార్టీ నేతలు ఎన్నికల ముఖ్య అదికారికి ఫిర్యాదు చేశారు.సత్తెనపల్లి నియోజకవర్గంలో అక్కడి రిటర్నింగ్ అదికారి శ్రీనివాసరావు, స్పీకర్ కోడెల శివప్రసాదరావులు కుమ్మక్కై పదిహేనువేల ఓట్లు తీయించేశారని వైసీపీ అదికార ప్రతినిది అంబటి రాంబాబు ఆరోపించారు.చివరికి తన ఓటు,తన కుటుంబ సభ్యుల ఓట్లు కూడా తీయించేశారని ఆయన చెప్పారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు,నరసరావుపేట ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి లతో కలిసి ఆయన మీడియాతోమాట్లాడారు. కేవలం ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో కోడెల ఇలాంటి అక్రమాలకుపాల్పడుతున్నారని, సంబందిత అదికారులపై చర్యలు తీసుకోవాలని రాంబాబు డిమాండ్ చేశారు. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కోడెల,ఆయన కుమారుడు దురాగతాలకు అంతం లేకుండా ఉందని అన్నారు.ఓట్ల గల్లంతుపై తము పోరాటం చేస్తామని వారు తెలిపారు.
