టాలీవుడ్ యంగ్ హీరో,మెగా హీరో సాయిధరం తేజ్ ,హీరోయిన్ రెజినా ప్రేమలో పడ్డారు.ఇప్పటికే పలు సార్లు వాళ్ళు డేటింగ్ కు విదేశాలకు వెళ్లి వచ్చారు.రేపో మాపో వివాహం కూడా చేస్కోబోతున్నారు.ఇప్పటికే ఇరువురు కుటుంబ పెద్దలు ఒప్పేసుకున్నారు.ఇక మూడు ముళ్ళతో ఒక్కటవ్వడమే ఆలస్యం అని వార్తలు పుంఖాను పుంఖానులుగా ఇటు సోషల్ మీడియా అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టిన సంగతి తెల్సిందే .
ఈ వార్తలకు బలం చేకూర్చే విధంగా నటి రెజినా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ నిజమే నేను ప్రేమలో ఉన్నాను.టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన యువహీరోతో ఆ ప్రేమలో మునిగి తేలుతున్నాను అని తెగేసి చెప్పింది అమ్మడు.తనపై వస్తున్న ఈ పుఖారులపై హీరో సాయి ధరం తేజ్ మాట్లాడుతూ రెజినా ప్రేమలో పడ్డట్లు వస్తున్న వార్తలు నిజమే కావచ్చు కానీ నేను మాత్రం ప్రేమలో లేను .నాకు రెజినా ఒక్క మంచి స్నేహితురాలు మాత్రమే..మేము ఇద్దరం చాలా క్లోజ్ అని అందరికి తెల్సిందే అని పరోక్షంగా మేమిద్దరం ప్రేమలో ఉన్నట్లు చెప్పారు అని మరో వార్త తాజాగా మీడియాలో చక్కర్లు కొడుతుంది.