సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తనయుడు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ట్విట్టర్ లో రికార్డ్ సృష్టించారు. ట్విట్టర్ ఫాలోవర్స్ కి సంబంధించిన మిలియన్ జాబితాలో అయన చేరారు.ప్రస్తుతం మంత్రి కేటీఆర్ ఫాలోవర్స్ సంఖ్య 10 లక్షలు దాటింది. ఈ సందర్భంగా Let’s stay connected అని కేటీఆర్ ట్వీట్ చేశారు. తనను ఫాలో అవుతున్న నెటిజన్లందరికీ మిలియన్ థ్యాంక్స్ చెప్పారు.రాష్ట్రంలో కానీ, దేశ, విదేశాల్లో ఎక్కడికి వెళ్ళినా తను చేస్తున్న ప్రతి పనిని ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు .అంతేకాదు.. ట్విట్టర్ ద్వారా వస్తున్న ఫిర్యాదులపై వెంటనే స్పందించి.. సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఆ సమస్యలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు.
? Let’s stay connected pic.twitter.com/rgQyXSEXrD
— KTR (@KTRTRS) February 9, 2018