ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కంటే మగాడు అని సీనియర్ నటుడు ,దర్శకుడు ,నిర్మాత పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశాడు.ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత నవ్యాంధ్ర రాష్ట్ర అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుది కాదు…ఆ పార్టీకి చెందినజెండా ,అజెండాలు కూడా చంద్రబాబుది కాదు.
ఆఖరికి ఎన్నికల సమయంలో ఓట్లు వేయమని అడగటానికి కూడా కావాల్సిన గుర్తు సైకిల్ కూడా ఆయనది కాదు .అప్పట్లో తెలుగు ప్రజల కష్టాలను తీర్చడానికి స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన పార్టీ.ఆయన కష్టార్జీతం.అయితే ఆ సమయంలో చంద్రబాబు నాయుడు పార్టీ నచ్చకపోతే ..లక్ష్మీ పార్వతీ నచ్చకపోతే పార్టీ నుండి బయటకు రావాలి .
లేదా పార్టీ పెట్టాలి కానీ ఇలా వెన్నుపోటు పోడిచి పార్టీ లాక్కోవడం కాదు అని ఆయన అన్నారు .కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు.తనపై అక్రమ కేసులు పెట్టిన కానీ పార్టీ నుండి బయటకు వచ్చి తానేమిటో నిరూపిస్తూ ఎన్నికల్లో గెలవడమే కాకుండా ఏకంగా తన పార్టీ తరపున అరవై ఏడు మందిని గెలిపించుకున్న మగాడు.దమ్మున్న నేత ..ఇదే జగన్ కు చంద్రబాబు మధ్య ఉన్న తేడా అని ఆయన అన్నారు ..