ఏపీ రాజకీయాల్లో నిన్న మొన్నటి వరకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నుండి మాజీ ఎమ్మెల్యే దగ్గర నుండి ప్రస్తుత ఎమ్మెల్యే వరకు ..మాజీ ఎంపీ నుండి ఎంపీ వరకు అందరు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార పార్టీ అయిన టీడీపీ పార్టీలోకి క్యూ కడుతున్న పలు సంఘటనలు చూశాం .తాజాగా సీన్ రివర్స్ అయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి .అందులో భాగంగా చంద్రబాబు సొంత ఇలాఖ అయిన చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎంపీ ఒకరు వైసీపీ గూటికి రావడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి .ప్రస్తుతం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నెల్లూరులో ఉన్న సంగతి తెల్సిందే .
ఇందులో భాగంగా జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.ఇటివల జగన్ కుప్పం నియోజకవర్గంలో నిర్వహించిన పాదయాత్రకు కూడా విశేష ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే ఏపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా ఎంపీ శివప్రసాద్ ను వైసీపీలోకి తీసుకురావాలని మాస్టర్ ప్లాన్ వేశారు అంట . అప్పట్లో ఎన్టీఆర్ పార్టీ పెట్టిన సమయంలో అప్పుడు స్టార్ హీరోయిన్ గా ఆర్కే రోజా ప్రస్తుత ఎంపీ శివప్రసాద్ కు ప్రచారం కూడా నిర్వహించారు కూడా .అప్పుడు నేను సినిమాల్లో ఉన్నాను .నేను చెబితే ఓట్లు పడతాయా అని రోజా అంటే ఎంపీ శివప్రసాద్ నువ్వు వస్తే తప్పకుండ నేను గెలుస్తాను .నాకు మంత్రి పదవీ కూడా వస్తుందని కూడా అనడంతో కాదనలేక రోజా ప్రచారంలోకి దిగారు .అంతే బంపర్ మెజారిటీ తో శివప్రసాద్ గెలుపొందారు .
ఆ చనువుతోనే ఎంపీ శివప్రసాద్ ను సంప్రదించారు అని వార్తలు వస్తున్నాయి.ఈ క్రమంలోనే ఇటివల ఒక మీడియా సమావేశంలో ఎంపీ శివప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పం ఓట్లతో మాత్రమే ఎంపీగా గెలవలేదు .తన సతీమణి రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఓటర్ల సహాయంతో గెలిచాను అని సంచలన వ్యాఖ్యలు చేశారు .అయితే శివప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యల వెనక ఆయన పార్టీ మారడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు .ఇప్పటికే వెలువడిన పలు సర్వేలల్లోనే కాకుండా లేటెస్ట్ గా వచ్చిన రిపబ్లిక్ టీవీ సర్వేలో కూడా టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోవడం ..గత నాలుగు ఏండ్లుగా టీడీపీ పార్టీ తన సామాజిక వర్గానికిచ్చిన హామీలను తుంగలో తోక్కడమే కాకుండా మంత్రి పదవుల నుండి తప్పించడం ..ప్రత్యేక హోదా ,రైల్వే జోన్ మీద వెనక్కి తగ్గడం ..పోలవరం ప్రాజెక్టులో భారీ కుంభ కోణాలు జరగడం ఇవన్ని ఎంపీ శివప్రసాద్ ను తీవ్ర ఆలోచనలో పడేసినట్లు ఆయన అనుచరవర్గం అంటున్నారు .త్వరలోనే వైసీపీలో చేరొచ్చు అని జిల్లా రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి .చూడాలి మరి ఎంపీ శివప్రసాద్ వైసీపీలోకి వస్తారో ..టీడీపీలో ఉంటారో ..?.