చిన్న పిల్లంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే…వారి మాటలు,నవ్వు,చిన్నపిల్లలు చేసే చేష్టలు ఒక్కొక్క సారి చూస్తే మనకే నవ్వు తెప్పిస్తాయి..కానీ వారికి ఏమైనా అయితే మాత్రం ఎవరు తట్టుకోలేరు.ఈ క్రమంలో మృత్యువు తో పోరాడి బ్రతికిన సంఘటన చైనా లో జరిగింది.వివరాల్లోకి వెళ్తే..2 ఏళ్ళ బాలుడు రాత్రి పూట 11 గంటల సమయంలో రబ్బరు బాలుతో ఆడుకుంటూ ..బెడ్ పై నుండి కింద పడ్డ్డాడు.దీంతో అక్కడ ఉన్న కరెంట్ ప్లగ్ నుండి బయటకు తీసివేసిన 3 పిన్ ప్లగ్ పిల్లాడి బ్రెయిన్ లో ఇరుక్కుపోయింది.
ఈ విషయాన్నీ గమనించిన అతని తల్లి వెంటనే దగ్గరిలోని ఆసుపత్రి కి తీసుకెల్లింది.వెంటనే స్పందించిన డాక్టర్లు ఎక్స్ రే తీసి, ఎలా ఉందో తల్లితండ్రులకు చూపించారు. వెంటనే ఆపరేషన్ చేయాలని, లేకపోతే ప్రమాదం అని డాక్టర్లు వారికి సూచించారు. దాదాపు 3 గంటల పాటు కష్టపడి బాలుడి తలలో ఇరుక్కున్న 3 పిన్ ప్లగ్ ను డాక్టర్లు బయటకు తీసివేశారు.అప్పుడు బాలుడి తల్లిదండ్రులు ఉపిరి పీల్చుకున్నారు.
సూచన..: కాబట్టి మీ పిల్లలు ఆడుకునేటప్పడు ఫోన్ ఛార్జర్స్, కరెంట్ వచ్చే చోటు, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ ల దగ్గర, ప్రమాదకరం అనిపించే చోటు పిల్లలకు దగ్గరగా, అందుకునే విధంగా ఉంచకండి. మీ చిరునవ్వుకు కారణమైన మీ పిల్లలకు ఏమీ కాకుండా జాగ్రత్తపడండి. ఈ విషయాన్నీ అందరికి తెలిసేలా షేర్ చేయండి.