కర్నూల్ జిల్లా డోన్ నియోజక వర్గం వైసీపీ ఎమ్మెల్యే, బీఏసీ ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి జనసేన అధినేత. టాలీవుడ్ అగ్రహీరో పవన్ కళ్యాణ్ పైతీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే బుగ్గన మీడియాతో మాట్లాడుతూ..జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ టీడీపీ కూటమి నుంచి ఎప్పుడు బయటకొచ్చారని ప్రశ్నించారు. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. ‘పవన్ ఇంకా టీడీపీతో కలిసే ఉన్నారని మేం అనుకుంటున్నాం. ఎందుకంటే అనంతపురంలో టీడీపీ మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి ఆతిథ్యం స్వీకరించారు. అనంతపురం జిల్లా గురించి తెలుసుకోవాలనుకుంటే కలెక్టర్‌ను కలిసి వివరాలు తెలుసుకుంటే సరిపోతుంది. దానికోసం టీడీపీ నేతలను కలవాలా అని బుగ్గన ఎద్దెవా చేశారు?. టీడీపీ నుంచి బయటకొస్తే పవన్ కల్యాణ్ గురించి ఆలోచిస్తాం. ఒకేవేళ నిజంగా జేఏసీ ఏర్పాడాలంటే ముందు అందులోకి టీడీపీ రావాలి. అసలు పవన్ కల్యాణ్ ఎజెండా ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు.’ అది ఎవ్వరికి తెలియదు…పోని ఆయనకు అన్నా తెలుసో లేదో అని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు.
