వదినతో ఏర్పడిన అక్రమ సంబంధాన్ని కొనసాగించేందుకు ఏకంగా అన్ననే హతమార్చోడో కామాంధుడు. అదీ కూడా…పథకం ప్రకారం బీహార్ రాష్ట్రం నుంచి హైదరాబాద్‌కు ఫ్లైట్‌లో వచ్చిమరీ చంపేశాడు. వివరాలు పరిశీలిస్తే.. బీహార్ రాష్ట్రం, ఛాప్రా జిల్లా, ఇబ్రహీంపూర్‌కు చెందిన జయ్‌మంగళ్‌దాస్ (35) అనే వ్యక్తి ఎనిమిదేళ్ల కిందట జీవనోపాధి కోసం హైదరాబాద్ నగరానికి వలస వచ్చాడు. ఈయన ఫతేనగర్‌లోని పైపులైను కాలనీలో నివాసముంటున్నాడు. భార్యా పిల్లలు మాత్రం బీహార్‌లోనే ఉంటున్నారు. అయితే, వీలు దొరికినప్పుడల్లా స్వగ్రామంలో ఉంటున్న భార్యాపిల్లల వద్దకు వెళ్లి వచ్చేవాడు. రానుపోను ప్రయాణ భారం తదితర సమస్యల వల్ల పిల్లలను తీసుకుని నగరానికి వచ్చేయాలని భార్యకు చెప్పాడు. దీంతో భార్య మాలతీదేవి పిల్లలతో కలిసి నగరానికి వచ్చేసింది. మాలతీదేవి ఇబ్రహీంపూర్‌లో ఉన్నప్పుడు తనకు మరిది వరుసయ్యే నీరజ్‌కుమార్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త దగ్గరికి చేరుకున్నా కూడా ప్రతీ రోజు ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడేది. ఈ క్రమంలో తమ అక్రమ సంబంధానికి అడ్డువస్తున్న భర్తను కడతేర్చేందుకు ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. ఇందుకోసం తన ప్రియుడిని పాట్నా నుంచి హైదరాబాద్‌కు వియానంలో రప్పించింది.
see also..ఎంపీ టీజీ వెంకటేశ్ బండారం మొత్తాన్ని రాష్ట్రపతికి పక్క ఆధారాలతో ….వైసీపీ ఎంపీ వియసాయిరెడ్డి
గత నెల 31వ తేదీ పట్నా నుంచి విమానంలో వచ్చిన నీరజ్‌కుమార్ అర్ధరాత్రి జయమంగళ్‌దాస్ మెడకు చున్నీ బిగించి హత్య చేశాడు. ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా లేఖ కూడా అతనే రాసి పెట్టాడు. తిరిగి విమానంలో వెళ్లిపోయాడు. ఇరుగుపొరుగు, తోటి కార్మికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదికలో మెడకు ఉరిబిగించి చంపేసినట్టు తేలడంతో పోలీసులు ఆరా తీశారు. మాలతీదేవి కాల్ డేటాను పరిశీలించగా, అసలు విషయం వెల్లడైంది.మాలతీదేవిని అరెస్టు చేశారు. నీరజ్‌కుమార్ కోసం బిహార్‌కు ప్రత్యేక బృందాన్ని పంపారు.