ప్రముఖ టీవీ యాంకర్ ప్రదీప్ ఇటివల న్యూ ఇయర్ రోజున డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికి సంచలనానికి కేంద్ర బిందువుగా మారిన సంగతి తెల్సిందే.తాజాగా యాంకర్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు.అయితే ఈ సారి డ్రంక్ అండ్ డ్రైవ్ లో కాదు.ఒక మంచి పనిచేసి ప్రదీప్ వార్తల్లోకి ఎక్కారు .అసలు విషయానికి వస్తే.. యాంకర్ ప్రదీప్ తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ,హైదరాబాద్ మహానగర మేయర్ బొంత్ రామ్మోహన్ కి ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.అదే ఏమిటి అంటే రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా పరిధిలో ఘట్ కేసర్ మండలానికి చెందిన చర్లపల్లి మండల పరిషత్ ప్రాధమిక బడిలో దాదాపు నూట ఇరవై మంది బాలికలు ,వందమంది బాలురు చదువుకుంటున్నారు.కానీ వీళ్ళకు సరిపడా ఒక్క బాత్రూమ్స్ లేవు.దీంతో వీరు చాలా ఇబ్బంది పడుతున్నారు.ముఖ్యంగా బాలికలు చెప్పలేని విధంగా కష్టాలు పడుతున్నారు.ఈ సమస్యను పరిష్కరించాలని ఆయన ట్వీట్ చేశాడు.
ప్రదీప్ చేసిన ట్వీట్‌కు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు.చర్లపల్లి పాఠశాలలో సమస్యలను పరిష్కరించాలని మేడ్చల్ కలెక్టర్‌ను ఆదేశించారు. మేడ్చల్ జిల్లా డీఈవో రేపు వెళ్లి పాఠశాలలో నెలకొన్న పరిస్థితులను పరిష్కరించాలని ఆదేశించామని.. యుద్ధప్రతిపాదికన చర్యలు తీసుకుంటామని కేటీఆర్‌కు కలెక్టర్ ట్వీట్ చేశారు
Absolutely will get it done. @Collector_MDL to respond and revert with an update pls https://t.co/NovC3RWGmc
— KTR (@KTRTRS) February 9, 2018
Our team checked it personally..kids facing lots of problems…specially girls@KTRTRS sir can we do sumthing asap pls@bonthurammohan https://t.co/05BUjE7P2s
— Pradeep Machiraju (@impradeepmachi) February 9, 2018