ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి అధికారం కోసం ..పదవుల కోసం టీడీపీలో చేరిన ఫిరాయింపు వైసీపీ ఎమ్మెల్యేలు ,ఎంపీల ప్రస్తుత పరిస్థితి ముందు చూస్తే నోయ్యి వెనక చూస్తే గొయ్యి అన్నట్లు ఉంది.ఎన్నికల సమయంలో అధికారం కోసం అరువందలకు పైగా హామీలను కురిపించి…తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను తుంగలో తోక్కడమే కాకుండా పలు అవినీతి అక్రమాలకు పాల్పడుతునే మరోవైపు విభజన చట్టంలో ఇచ్చిన ప్రత్యేక హోదా ,విశాఖ పట్టణానికి రైల్వే జోన్ లాంటి తదితర అంశాలను మిత్రపక్షాలైన టీడీపీ బీజేపీ పార్టీలు గాలికి వదిలేశాయి.దీంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పార్టీకి రాష్ట్రంలో ఎదురుగాలి వీస్తుందని ఇప్పటికే పలు సర్వేలు తేల్చి పారేశాయి.అయితే ఈ సర్వేల ఎఫెక్ట్ లేదా టీడీపీ పార్టీలో ఇమడలేకపోవడమో కానీ పార్టీ ఫిరాయించిన వైసీపీ ఎమ్మెల్యేలు ,ఎంపీలు పునరాలోచన పడ్డారు.
see also : కండోమ్ ఉన్నా, లేకున్నా తేడా ఏంటి.. చేసేది శృంగారమే కదా..పీహెచ్డీ విద్యార్థి
అందులో భాగంగా కర్నూలు ఎంపీ బుట్టా రేణుక మరల పార్టీలోకి రావాలని ఆలోచనలో పడ్డారు అంట.ఇటివల ఆమె బాబు సర్కారు బాగా పని చేస్తుంది.అభివృద్ధికి అండగా ఉందామనే టీడీపీ పార్టీకి మద్దతు పలుకుతున్నాను అని ఆమె పార్టీ మారిన సంగతి తెల్సిందే.అయితే ఇటివల కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి చెందిన మీడియాగా భావిస్తున్న రిపబ్లిక్ టీవీ నిర్వహించిన సర్వేలో వైసీపీ పార్టీ పన్నెండుకు పైగా ఎంపీ సీట్లను గెలుస్తుందని…అందులో కర్నూలు పార్లమెంట్ స్థానాన్ని కూడా ఈ సారి భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని తేల్చి చెప్పిన విషయాన్నీ చాలా త్వరగానే పసిగట్టారు అంట బుట్టా రేణుక.ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీలో ఉంటె వచ్చే ఎన్నికల్లో గెలవడం సంగతి అటుంచితే కనీసం డిపాజిట్లు కూడా దక్కవు అని ..
see also : ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వైఎస్ భారతి ఎంట్రీ …వైసీపీ క్లారిటీ…
తను పార్టీ మారిన కానీ వైసీపీ క్యాడర్ అట్లనే ఉందని అర్ధమైన బుట్టా రేణుక చేసిన తప్పును తెల్సుకోవడమే కాకుండా దాన్ని సరిదిద్దుకునే క్రమంలో వైసీపీలోకి రావడానికి ఆరాటపడుతున్నారు అంట.అందుకే ప్రస్తుతం లోక్ సభలో ప్రత్యేక హోదా ,బడ్జెట్ మీద అంత రచ్చ జరుగుతున్న కానీ ఆమె ఎంట్రీ ఇవ్వకుండా దూరంగా ఉంటూ వస్తున్నారు.ఒకవేళ టీడీపీ తరపున లోక్ సభలో పోరాడితే వేటు పడుతుంది.అప్పుడు వైసీపీ ఎంపీ కాదు అని తేలుతుంది.దీంతో వైసీపీలో ఉంటున్నాను అనే సంకేతాలను కింది స్థాయి క్యాడర్ కు పంపాలనే లక్ష్యంతోనే ఈ వ్యవహారంలో తల దూర్చడంలేదని ఆమె అనుచరవర్గం చెబుతున్నారు.ఒకవేళ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే పార్టీలోకి రావడానికి బుట్టా రేణుక సిద్ధమని కర్నూలు కు చెందిన వైసీపీ సీనియర్ మాజీ మంత్రికి సమాచారం అందించారు అంట .సదరు మంత్రి జగన్ తో ఒక్కసారి మాట్లాడి చెబుతాను అని బదులిచ్చారు అంట .ప్రస్తుతం పాదయాత్రలో ఉన్న జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి .
see also : పవన్ కళ్యాణ్ కు ఆదిలోనే బిగ్ షాక్ ..తట్టుకోవడం కష్టమే ..!