కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ, వామపక్షాలు ఇచ్చిన బంద్ పిలుపునకు ప్రధాన ప్రతిపక్షం వైసీపీ, కాంగ్రెస్‌లు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో గురువారం తెల్లవారుజాము నుంచే విద్యార్థులు, నేతలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు ఆరంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లోని అన్ని డిపోల ఎదుటా సీపీఐ, సీపీఎం, వైసీపీ నేతలు బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. రహదారులకు అడ్డంగా నిలబడి నిరసన తెలిపి ప్రైవేటు వాహనాలను కూడా ఎక్కడికక్కడ నిలిపేస్తుండటంతో జనజీవనం స్తంభించింది. ఇక పోతే అనంతపురం జిల్లాలో చిన్న ఘర్షణ జరిగింది. పెనుకొండ నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్ర బంద్ను నిర్వహిస్తున్న ఆందోళన కారులను పెనుకొండ టి.డి.పి ఎమ్మెల్యే బి.కె.పార్థసారథి పోలీసుల ముందే బూతు పురాణం ఒప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అదేవిధంగా పోలీస్ స్టేషన్ ముందు పెనుకొండ వైసీపీ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మాలగుండ్ల శంకర నారాయణ ,కాంగ్రెస్ పార్టీ లీడర్ కె.టి.శ్రీధర్ ,సి.పి.ఐ, సి.పి.ఎం పార్టీ నాయకులు ఆందోళన దిగారు. వీడియోలో మీరే చూడండి..
