లైంగిక వేధింపులకు గురైన వారు ధైర్యంగా బయటకు వచ్చి జరిగిన అన్యాయంపై పోరాడటం, బాధితులకు అండగా నిలిచేందుకు చేపట్టిన మీటూ ఉద్యమం ( మీ.. టూ) వల్ల ఇప్పటికే చాల మంది మహిళలు వారికి ఎదురైన లైంగిక దాడుల గురించి ధ్యైర్యంగా మీడియా ముందుకు వచ్చి చెప్పారు.ఈ నేపథ్యంలో మరో మహిళ 47 ఏళ్ల కిందట ఎదుర్కొన్న లైంగిక దాడిపై ఫిర్యాదు చేసినట్లు సమచారం.
బాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత జితేంద్ర (రవి కపూర్) తనను లైంగికంగా వేధించాడంటూ ఆయన మేనకోడలు ఆరోపించారు. లైంగిక వేధింపుల ఘటనను వివరిస్తూ హిమాచల్ ప్రదేశ్ డీజీపీ కార్యాలయానికి బాధితురాలు ఫిర్యాదు లేఖ రాశారు.
see also.. తొలిరాత్రి కోసం గదిలోకి పంపారు…ఉదయాన్నేనా భార్యను నా తమ్ముడితో పెళ్లి చేయ్యండి..ఎందుకు
‘1971లో జితేంద్ర సిమ్లా లోకేషన్లలో షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. అప్పుడు ఆయనకు 28 ఏళ్లు కాగా, నాకు 18 ఏళ్లు. అన్ని సిద్ధం చేశానని, షూటింగ్ చూసేందుకు రావాలని జితేంద్ర కోరగా.. నేను ఢిల్లీ నుంచి సిమ్లాకు వెళ్లాను. హోటల్ రూములో నా కోసం రూమ్ బుక్ చేశాడు. షూటింగ్లో పాల్గొన్న ఆయన రాత్రి హోటల్లో నా గదికి వచ్చారు. చాలా అలసిపోయాననని, ఇక్కడే విశ్రాంతి తీసుకుంటానని చెప్పాడు. మధ్యరాత్రి లేచి చూసేసరికి జితేంద్ర తన బెడ్‌ను నా బెడ్‌తో కలిపి ఉంచారు. కళ్లు తెరిచి చూసేసరికి నన్ను ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు. మద్యం మత్తులో నాపై లైంగిక దాడి చేసిన తర్వాత జితేంద్ర హోటల్ నుంచి వెళ్లిపోయారు. ఆ రాత్రికి భయంభయంగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చిందని రెండు పేజీల ఫిర్యాదు లేఖలో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.
see also..హైదరబాద్ లోని లేడీస్ హాస్టల్లో అమ్మాయిలు స్నానం చేస్తుండగా…వీడియో తీసింది ఎవరో తెలుసా..!