కొండ చిలువ కంటే బలం తక్కువగా ఉన్నా నాగు పాము విషానికి పవర్ ఎక్కువ. ఇది కరిచిందంటే క్షణాల్లో ప్రాణాలు పోతాయి. అలాంటిది కొండ చిలువ, నాగుపాము కొట్లాటకు సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొండ చిలువ, నాగుపాము రెండూ భయంకరమైన సర్పాలే. ఒకదానికి బలమెక్కువైతే, మరొకదాని విషం ప్రాణాంతకమైనది. ఈ రెండింటి మధ్య ఏకాంత ప్రదేశంలో ఫైట్ జరిగింది. కొండ చిలువ తన బలంతో నాగుపామును చుట్టి హత మారిస్తే, నాగుపాము తన చివరి క్షణాల్లో వేసిన కాటుకు కొండ చిలువ ప్రాణాలు పోయాయి. ఈ ఫైట్ లో రెండూ ప్రాణాలు కోల్పోయాయి.
ఈ ఫైట్ ఎక్కడ జరిగిందన్నది సరిగ్గా తెలియనప్పటికీ, ఆసియాలోనే జరిగి ఉంటుందని నిపుణుల అంచనా. ఈ ఘటన ఆగ్నేయాసియాలో చోటు చేసుకొని ఉండొచ్చని ఫ్లోరిడా మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీకి చెందిన కోలెమన్ షీహీ, నేషనల్ జియోగ్రఫీకిచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.