తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా తన డివిజన్ అయిన 19వ డివిజన్ ను ఈ రోజు మేయర్ నన్నపునేని నరేందర్ బైక్ పై సందర్శించారు.వీది వీది కలియదిరుగుతూ రోడ్లు,డ్రైనేజీల పరిస్థితిని పరిశీలించారు .స్థానికి DE ప్రబాకర్ కు అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించవలసిందిగా ఆదేశాలు జారీ చేసారు.ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.తను చిన్నప్పటినుండి పుట్టి పెరిగిన ఏరియా కావడంతో అందరిని పేరు పేరున పలకరిస్తూ ర్యాలీ కొనసాగింది.డివిజన్ చేపట్టవలసిన అభివృద్ది పనులు,పారిశుద్య నిర్వహణ,ప్రజల సమస్యలు,వాటి పరిష్కారం పై క్షేత్రస్థాయిలో తిరుగుతూ మేయర్ పరిశీలించారు.
see also :ఫిరాయింపు ఎమ్మెల్సీకి షాకింగ్ ట్రీట్‌మెంట్…ఇప్పుడు జగన్ గుర్తుకొస్తున్నాడా..?
ఈ సందర్బంగా మేయర్ నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ.. ఈ నగరంపై ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ,పురపాలక శాఖామాత్యులు కేటీఆర్ గారు ప్రత్యేక శ్రద్ద ఉంచి అభివృద్దికి నిదులు కేటాయిస్తున్నారని నాకు మేయర్ గా అవకాశం కల్పించినందుకు వారికి దన్యవాదాలని అలాగే 19వ డివిజన్ నాకు రాజకీయ జన్మనిచ్చిందని ఇక్కడి ప్రజలు నన్ను నమ్మకంతో గెలిపించారని,వారి నమ్మకాన్ని నిలబెట్టే దిశగా పనిచేస్తున్నానని అన్నారు.నగరంకు దీటుగా ఈ డివిజన్ ను అభివృద్ది చేస్తానని ,ఇప్పటికే పలు అభివృద్ది పనులు పూర్తయ్యాయని,సీసీ రోడ్లు,మురికి కాలువల నిర్మాణాలు చేపడుతున్నామని,ప్రతీకాలనీకి కొత్తలుక్ తీసుకువస్తామని మేయర్ నరేందర్ అన్నారు.నగరం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశిస్శులతో గొప్పగా అభివృద్ది చెందుతుంది అని,తెలంగాణా రాష్ట్ర సాదనలో ఈ నగరం ఉద్యమానికి ఊతమిచ్చిందని,అందుకే ముఖ్యమంత్రిగారు ఈ నగరంపై ప్రత్యేక ప్రేమ చూపెడుతూ అభివృద్ది చేస్తున్నారని,ప్రజలు కూడా అభివృద్దికి సహకరించాలని,ప్రజల బాగస్వామ్యం ఉంటేనే ఏ కార్యమైన విజయం సాదిస్తుందని మేయర్ అన్నారు.ఈ రోజు సమస్యలను తెలుసుకోవడం కోసం బైక్ పై పర్యటించానని గుర్తించిన సమస్యలను పరిష్కారం దిశగా కృషి చేస్తానని మేయర్ అన్నారు..19వ డివిజన్ లో 6కోట్లతో నూతనంగా సైడ్ కాలువలు,సీసీ రోడ్లు,కల్వర్టులు,రోడ్డు మరమత్తుల పనులకు ప్రతిపాదనలు పంపడం జరిగిందని,మిగిలిన పనులను పరిశీలించడానికి ఈ రోజు డివిజన్ లో తిరగడం జరిగిందని మేయర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో మహిళా అద్యక్షురాలు మోహిణీ బాయి ఘాటే,ఇందిర,మోడెం ప్రవీణ్,కొణతం మోహన్, కర్నాల సత్యం,బొజ్జ శ్రీను,పెంచాల కుమారస్వామి,వడ్డెపల్లి భరత్,కొత్తపల్లి శ్రీను,వడిక విద్యాసాగర్,పాలెపు రాజు,రాజేష్,మేరుగు అశోక్,గడ్డం రవి,రెడ్డి కృష్ణ, తొగరు వేణు,అభిలాష్,నూతన్,శ్రీనాద్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.
see also : బ్లూ ఫిలింలో ఆ బాడీకి నా ఫేస్ పెట్టి.. నా భర్త చూసి । యాంకర్ శ్యామల
see also : గాడ్ సెక్స్ అండ్ ట్రూత్..-2లో నటించేందుకు సిద్ధం.. జబర్దస్త్ యాంకర్